Breaking News

రేపటి నుంచి నెల్లూరు లాక్ డౌన్..!

23 rd Jul 2020, UTC
రేపటి  నుంచి నెల్లూరు లాక్ డౌన్..!
 
కరోనా మహమ్మారి కేసులు విస్తృతం గా పెరుగుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్ నియమాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికి అక్కడ కేసుల సంఖ్యా తగ్గుముఖం పట్టడం లేదు.. ప్రస్తుతం కేసులు ఎక్కువ నమోదు అవుతున్న ప్రాంతాలపై అధికారులు దృష్టి పెట్టారు. తాజాగా.. చిత్తూరు కర్నూలు జిల్లాలతో పాటు గా నెల్లూరు లో కూడా అత్యధికం గా కేసులు నమోదు అవుతున్నాయి.
 
      ఈ నేపధ్యం లో నెల్లూరు లో లాక్ డౌన్ ను విధించారు.  కరోనా విజృంభిస్తోన్న నెల్లూరు జిల్లాలో సంబంధిత కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గురువారం నాటికి కరోనా కేసుల సంఖ్యా మూడు వేలు దాటింది.. ఈ నేపధ్యం లో నెల్లూరు లో పూర్తి లాక్ డౌన్ ను విధించాలని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం నుంచి లాక్‌డౌన్ విధించనున్నారు. కరోనా మహమ్మారి కారణం గా ఒక్క నెల్లూరు లో ఇప్పటివరకు 65 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
       గడచినా 24 గంటల్లో నెల్లూరు లో 327 కేసులు నమోదయ్యాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కరోనా కేసులు రోజు రోజు కు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 3,010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో.. శుక్రవారం నుంచి నెల్లూరు లో కూడా లాక్ డౌన్ ను విధిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు వారం రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని అధికార వర్గాలు  తెలిపాయి.  ఈ లాక్ డౌన్ టైం లో ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఉంటుంది. మెడికల్ షాపులు, పాల బూత్ లకు మాత్రం సాయంత్రం వరకు అనుమతి ఉంటుంది.  ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించి గ్రామా పంచాయితీల్లోనూ.. మునిసిపాలిటీల్లోనూ లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox