Breaking News

దేవరగట్టులో కర్రల యుద్దం.. వందమందికి గాయాలు

16 th Oct 2021, UTC

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర  సందర్బంగా శుక్రవారంం అర్థరాత్రి చెలరేగిన హింసలో సుమారు వందమందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు.  దేవరగట్టలో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండమీద మాళ మల్లేశ్వరస్వామి  కళ్యాణం తర్వాత విగ్రహాలను సొంతం చేసుకునేందుకు ఆ ప్రాంత పరిసరాల్లో ఉన్న 12 గ్రామాల ప్రజలు రెండు విభాగాలుగా విడిపోతారు. ఇక ఈ రెండు వర్గాల మధ్య జరిగే ఉత్సవమే కర్రల యుద్ధం.

ఇందులో తలలు పగలగొట్టుకుని మరి యుద్ధం చేస్తారు. మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాల్లో ప్రతి ఏడాది ఈ యుద్ధం ఆచారంగా జరుగుతుందిఇక ఈ యేడు కూడా ఈ ఉత్సవం జరిగింది. ఈ యుద్ధంపై స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే హింస జరిగింది.ఈ  యుద్ధంలో తలలు పగులుతాయని అంతకుముందే మానవ హక్కుల కమిషన్  కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు కూడా నోటీసులు జారీ చేసింది.

 సీసీ, డ్రోన్ కెమెరాలతో పోలీసుల పర్యవేక్షణ, కరోనా కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఒక్కో గ్రామం నుంచి 150 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox