Breaking News

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయి... మాజీ ఎంపీ హర్షకుమార్

26 th Jul 2020, UTC

  ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని  మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. ఒంగోలు రంగాభవన్ లో దళితులపై దాడులపై టీడీపీ ఆద్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్టొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 
 రాజమండ్రి, చీరాలలో జరిగిన ఘటనలు రాష్ట్రంలోని పరిస్థితులపై ఆందోళన కలిగిస్తున్నాయని, చీరాలలో మృతి చెందిన కిరణ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి బాధ్యుడైన ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే మేం సీఎం జగన్ ను హర్షిస్తామని, చీరాల ఘటనకు బాధ్యుడైన ఎస్ఐ విజయ్ కుమార్ మోపిదేవి వెంకటరమణ అనుచరుడని, అందుకే అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని హర్షకుమార్ ఆరోపించారు.
 
టీడీపీ హయాంలో ఇబ్బందులు పడ్డామనే ఉద్దేశ్యంతో 95 శాతం మంది దళితులు వైసీపీకి ఓట్లు వేసి పట్టం కట్టారని, సీఎం జగన్ పోలీసులకు రహస్యంగా తాఖీదులు ఇచ్చి దళితులను అణిచివేయమని చెప్పినట్లు అర్ధమవుతుందని హర్షకుమార్ అన్నారు. డాక్టర్లను అందరు దేవుడుగా భావిస్తుంటే సీఎం జగన్ మాత్రం పశువుల్లాగా చూస్తున్నారని, డాక్టర్ సుధాకర్ బాబు, డాక్టర్ అనితారాణి, లాయర్ రామకృష్ణ, వైసీపీ దళిత నాయకుడు రత్నకుమార్ లపై జరిగిన దాడులు, దళితులపై సీఎం జగన్ తీరుకు అద్దం పడుతున్నాయని విమర్శించారు.
 
అప్పట్లో వైఎస్ఆర్ పాలన ఈ విధంగా లేదని, ఏడాది పాలన చూసిన ఏపీ ప్రజలు జగన్ ఎప్పుడు దిగిపోతాడా అని ఎదురు చూస్తు న్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో ముఖ్యమంత్రి జగన్ గ్రామాల బాట పడితే తెలుస్తుందని హర్షకుమార్ సూచించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox