Breaking News

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ కొట్టివేత..!

29 th Jul 2020, UTC

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి హైకోర్టు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అలాగే ఏ1 రమేష్ కుమార్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఏ మురళి, మరో నిందితుడు సుబ్బారావు పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. అచ్చెన్నాయుడు ప్రస్తుతం విజయవాడ రమేష్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై గత నెల 12న అచ్చెన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్‌పై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
 
ఏపీలో ఈఎస్‌ఐ   ఆసుపత్రుల్లో గత ఐదేళ్లలో  జరిగిన మందుల, ఇతర పరికరాల కొనుగోళ్లకు  సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు చేసింది. పలు అవినీతి అక్రమాలు జరిగినట్లు నిర్దారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఏసీబీ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తోంది.
 
అప్పటి కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఆదేశాలతో  టెలిహెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థకు కాల్ సెంటర్, టోల్ ఫ్రీ మరియు ECG సంబంధించి కాంట్రాక్ట్ చేసుకున్నారు.. దీనిపై మంత్రి ఓ లేఖ కూడా రాశారు. తర్వాత అప్పటి IMS డైరెక్టర్ అయిన డాక్టర్ సీకే రమేష్ కుమార్ ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని తేలింది. ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడితో పాటూ మరో తొమ్మిదిమంది అరెస్ట్ అయ్యారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox