Breaking News

వైఎస్సార్ లేకపోవడం వల్లే రాష్ట్రం రెండు ముక్కలు.: మాదిరెడ్డి ప్రతాప్

13 th Jul 2020, UTC

ఏపీఎస్ ఆర్టీసీ మాజీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ లేకపోవడం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని.. జగన్ ను పొలిటికల్ ఇంట్రస్ట్ వల్లే జైల్లో పెట్టారన్నారు. వైఎస్ హయాంలో ఐదేళ్ల పాటూ ఐటీ కార్యదర్శిగా పనిచేశానని.. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కొందరు అధికారుల్ని బదిలీ చేసిన ఫైల్స్‌పై విచారణ జరిపింది అన్నారు.

తనను మాత్రం విచారించలేదని.. అది తన ఇంటిగ్రిటీ అన్నారు. తన బదిలీని ప్రభుత్వ విజ్ఞత కే వదిలేస్తున్నాను అన్నారు. అనేక కారణాలతో తన బదిలీ జరిగి ఉండొచ్చని.. తన బదిలీ నిర్ణయాన్ని స్వాగతిస్తాను అన్నారు.

 మాదిరెడ్డి ప్రతాప్ స్థానంలో రవాణాశాఖ కార్యదర్శి కృష్ణబాబుకి ఆర్టీసీ వీసీ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్‌ను ఏపీఎస్పీ బెటాలియన్ల అడిషనల్‌ డీజీగా బదిలీ చేసింది.

 మాదిరెడ్డి ప్రతాప్‌ను  అకస్మాత్తుగా బదిలీ చేయడం అధికార వర్గాల్లో కూడ చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన నిర్ణయాలు ప్రభుత్వానికి నచ్చకపోవడం వల్లే బదిలీ వేటు పడిందని తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox