ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తాడిపల్లి లోని సీఎం జగన్ నివాసం లో సీఎం జగన్‌తో అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్‌తో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అమూల్ ఎండీ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ ఒప్పందం రాష్ట్ర పరిశ్రమల రంగం లో ఓ మైలురాయి లాంటిదని సీఎం జగన్ వర్ణించారు. ఈ ఒప్పందం ఎపి లో మహిళల జీవితాల్ని గొప్పగా మారుస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు.
అలానే ప్రభుత్వ సహకార డైరీ లకు కూడా మంచి రోజులు వచ్చాయని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేసారు. దక్షిణాధి రాష్ట్రంలో 'గేట్‌వే'గా ఆంధ్రప్రదేశ్ మారబోతోంది అని జగన్ సంతృప్తి గా అన్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా కింద మహిళలకు 11వేల కోట్ల రూపాయలను అందిస్తున్నామని వై ఎస్ జగన్ గుర్తు చేసారు. పాడి రైతులకు కూడా ఈ ఒప్పందం ద్వారా లాభం చేకూరబోతోందని జగన్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ ఒప్పంద సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ వాణీ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది.