Breaking News

ఎస్ ఇసి సెక్రటరీగా వాణిమోహన్ అవుట్ 

12 th Jan 2021, UTC
ఎస్ ఇసి సెక్రటరీగా వాణిమోహన్ అవుట్ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో అధికారిపై వేటు వేసారు. తాజాగా సెలవుపై వెళ్లిన రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరక్టర్ జీవీ సాయి ప్రసాద్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం జరిగి 24 గంటలు గడవక ముందే మరో అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్ఈసీ సెక్రటరీగా ఉన్న వాణిమోహన్ ను తొలగిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.

వాణిమోహన్ సేవలు ఎన్నికల కమిషన్ లో అవసరం లేదంటూ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. ఆమెను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నవారిపైన, ప్రభుత్వానికి మద్దతుగా వున్నవారిపైన రమేష్ కుమార్ గుర్రుగా వున్నారని ఈ రెండు సంఘటనలు చెబుతున్నాయని అంటున్నారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox