Breaking News

ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ రికార్డు..!

09 th Jun 2020, UTC
ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ రికార్డు..!

ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ మరో అత్యంత అరుదైన మైలురాయికి చేరుకుంది. జూన్‌8 ఒక్క రోజే అరకోటి మందికి పైగా కూలీలకు పని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 54,51,939 మంది కూలీలు ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యారు.

 వ్యవసాయ పనుల్లేని పరిస్థితులు, కరోనా విపత్కర పరిస్థితులతో గ్రామీణ నిరుపేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా పనుల కల్పనపై దృష్టి పెట్టింది. లాక్‌డౌన్‌ కారణంగా తిరిగొచ్చిన వలస కూలీలకు వారి సొంత ఊర్లోనే పని కల్పించేలా తక్షణమే 1, 58, 400 జాబ్‌ కార్డ్‌లు మంజూరు చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 1నుంచి 8.84 కోట్ల పనిదినాలు కల్పించి సోమవారం వరకు కూలీలకు రూ.2,035 కోట్ల వేతనాల రూపంలో చెల్లించారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న వారిలో 82 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. లాక్‌డౌన్‌లోనూ ఒక్కో కుటుంబం రూ.20వేలకుపైగా ఆదాయం పొందింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox