Breaking News

నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలి : గవర్నర్

22 nd Jul 2020, UTC

ఎస్ ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం తొలగించడాన్నిహైకోర్టు తప్పు పట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెర్సెస్ నిమ్మగడ్డ అన్నట్లు పరిస్థితి తయారైంది.. నిమ్మగడ్డ విషయం లో జగన్ సర్కార్ కు హై కోర్ట్ నుంచి చుక్కెదురైంది. ఆయనను తిరిగి ఎస్ఈసి పదవి లో నియమించాల్సిందేనని హై కోర్ట్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు ఆయన నియామకం జరగలేదు.
 
ఈ నేపధ్యం లో నిమ్మగడ్డ రమేష్ తన పదవి లో పునర్నియామకం విషయం లో హై కోర్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం గవర్నర్ ను కలిశారు. అయితే.. ఈ విషయం లో స్టే కోసం.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ ను ఆదేశించింది. అయితే.. సుప్రీమ్ కోర్ట్ లోను ఏపీ సర్కార్ జోరు కు బ్రేకులు పడ్డాయి.. స్టే విధించడానికి సుప్రీమ్ కోర్ట్ అంగీకరించలేదు.. దీని కారణం గా.. నిమ్మగడ్డను తిరిగి పదవి లోకి తీసుకోవాల్సి ఉంది.. కానీ.. ఇప్పటివరకు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ పని చేపట్టలేదు. దీనితో.. నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేసారు. ఈ వ్యవహారం లో గవర్నర్ ను కలవాలని హై కోర్ట్ ఆదేశించింది. 
 
            దీనితో.. నిమ్మగడ్డ గవర్నర్ ను కలిశారు.. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జరిగిన వ్యవహారాన్ని వివరించారు. తనను తిరిగి పదవి లోకి అనుమతించాలని నిమ్మగడ్డ ఓ వినతి పత్రాన్ని కూడా అందించారు. ఈ నేపధ్యం గవర్నర్ నిమ్మగడ్డను తిరిగి పదవి లోకి తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు.. నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసి పదవి లోకి తీసుకోవాలని ఆదేశించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox