Breaking News

గృహ నిర్మాణాలపై ఏపీ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్

09 th Oct 2021, UTC

గృహ నిర్మాణాలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది.  ఈ పిటిషన్ శనివారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం జాతీయస్థాయిలో ఉన్న పథకం కంటే ఉత్తమమైనదిగా ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను సింగిల్ జడ్జి పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం‘పేదలందరికీ ఇళ్ల పథకం’తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ పథకం పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేవలం మహిళల పేరిట మాత్రమే పట్టాలు ఇవ్వాలన్న విధానాన్ని తప్పుపట్టింది. సెంటు, సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాలు ఏర్పాటు చేస్తామనడంలో హేతుబద్ధతనూ ప్రశ్నించింది. దీనిపై... లోతైన అధ్యయనం అవసరమని తెలిపింది. అప్పటిదాకా ఈ పథకాన్ని అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి శుక్రవారం ఈ కీలక తీర్పు వెలువరించారు. 

నవ రత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించుకుంది. దీనిపై  2019 డిసెంబరు 2న జారీ చేసిన 367, 488 మార్గదర్శకాల జీవోలను సవాల్‌ చేస్తూ తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాలను కేవలం మహిళా లబ్ధిదారులకే కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. పారదర్శకంగా ఇళ్ల  స్థలాలు కేటాయించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox