Breaking News

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

23 rd Sep 2020, UTC

తిరుమల :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్‌ను, డైరీని ఆయన ఆవిష్కరించారు. బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 6.15 గంటలకు పద్మావతి అతిధి గృహం నుండి బయలుదేరి, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు నాద నీరాజనం సుందర కాండ పారాయణ కార్య క్రమంలో పాల్గొంటారు. అలాగే కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుమల నుండి 9.20 గంటలకు బయలుదేరి 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం తిరుగు ప్రయాణం అవుతారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox