Breaking News

అసెంబ్లీ లో రగడ.. జగన్ వర్సెస్ చంద్రబాబు.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్..!

30 th Nov 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :నేటి నుంచి ఏపీ అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ సర్కార్ ప్రతిపాదించిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుని అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు పై గతంలో కూడా తీవ్రంగా చర్చ జరిగింది. తాజాగా ఈ బిల్లుని అసెంబ్లీ ఆమోదించడం పట్ల ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. అసలు ఈ బిల్లు పై ఎలాంటి చర్చలు జరపకుండా ఎలా ఆమోదిస్తారని అభ్యంతరం వ్యక్తం చేసారు. దీనితో, ప్రతిపక్ష అభ్యంతరాలపై సీఎం జగన్ స్పందించారు. 

ఈ బిల్లు పై గతంలోనే చాలా చర్చలు జరిగాయని గుర్తు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని పంపిస్తే మండలి తిప్పి పంపిందని, అందుకే వారికి తిరస్కరించడానికి వీలు లేదని సీఎం జగన్ అన్నారు. 151 మంది సభ్యులున్న ప్రభుత్వం గతంలో ఆమోదించిన చట్టాన్ని తిరిగి ఆమోదిస్తున్నామని తెలిపింది. ఇది కేవలం లాంఛనంగా మాత్రమే ఆమోదిస్తున్నామని జగన్ వివరించారు. ఇదేదో కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు ప్రతిపక్ష నేతలు ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. 

ఎన్నికల సమయంలో ఎవరు డబ్బులు ఖర్చు చేయకుండా ఉండటానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఎవరైనా అక్రమంగా డబ్బు ఖర్చు చేస్తే, వారిని పట్టుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. విపక్ష నేత ఏమి మాట్లాడుతున్నారో, ఆయనకే అర్ధం కావడం లేదని సీఎం జగన్ వ్యాఖ్యలు చేసారు. 

మరో వైపు పంట నష్టం పై కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పదమూడు మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. చంద్రబాబు, అచ్చెన్న, బుచ్చయ్య., రామానాయుడు, సాంబశివ రావు, అశోక్, కేశవ్, మంతెన, బాల వీరాంజనేయస్వామి, ఆదిరెడ్డి భవాని, రామకృష్ణ బాబు, తదితరులు ఉన్నారు. వీరిని సభ నుంచి వెళ్లిపోవాలంటూ స్పీకరు ఆదేశించారు. వీరు ఒక రోజు పాటు సస్పెండ్ కానున్నారు.  అయితే, చంద్రబాబు తదితరులు మాత్రం అసెంబ్లీలోనే బైఠాయించారు. పంట నష్టానికి పరిహారం ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. డిసెంబర్ లోపు ఇన్ ఫుట్ సబ్సిడీ అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. టీడీపీ నేతలు అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారని సీఎం జగన్ అన్నారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం అసెంబ్లీలోనే బైఠాయించి నిరసనలు తెలిపారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox