Breaking News

దివ్య హత్య కేసులో మరో ట్విస్ట్..!

20 th Oct 2020, UTC
దివ్య హత్య కేసులో మరో ట్విస్ట్..!

ఆంధ్రప్రదేశ్ :విజయవాడకు చెందిన దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు నాగేంద్రనే పధకం ప్రకారం హత్య చేసారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు పలు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు. నాగేంద్ర నే హత్యకు పాల్పడ్డాడని ప్రాధమికం గా నిర్ధారించారు. కాగా ఇందుకు సంబంధించిన ఆధారాలకోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడి కాల్‌డేటాను పరిశీలించారు. ఈ కాల్ డేటా ప్రకారం హత్యకు ముందు నాగేంద్ర తన స్నేహితుడితో మాట్లాడినట్లు గుర్తించారు.

పోలీసులు అతనితో విచారణ జరపగా దివ్య చనిపోవడానికి ముందు నాగేంద్ర తనను దివ్య ఇంటికి రావాల్సిందిగా కోరినట్లు అతను తెలిపాడు. అయితే అతను వచ్చే సరికే రక్తపుమడుగులో ఉన్న దివ్యను ఆసుపత్రికి తరలిస్తున్నారని, మరో వైపు నాగేంద్రని కూడా రక్తపు మడుగులో చూశానని చెప్పుకొచ్చాడు. నిందితుడు దివ్య ఇంటికి కొద్దీ దూరంలో బండిని ఆపి మరికొంత దూరం నడుచుకుంటూ వెళ్లినట్లు నిర్ధారించారు. 

ప్రస్తుతం ఈ కేసు దిశా కోర్టుకు తరలించబడింది. అక్కడి అధికారులు దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ మళ్లీ విచారిస్తున్నారు. సోమవారం ఉదయం దిశా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దివ్య కుటుంబసభ్యులను, చుట్టుపక్కల వారిని విచారించారు. మరో వారం లోపు అభియోగ పత్రం ఇవ్వాల్సిందిగా డిజిపి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు శాస్త్రీయ ఆధారాలకోసం గాలిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox