Breaking News

"రాజధాని" ఎక్కడ..?

11 th Aug 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్: ఈ ప్రతిపాదన అమరావతి ఉద్యమానికి నాంది పలికింది. అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి కేవలం పరిపాలన విభాగాలను తరలిస్తామని వైసీపీ చెబుతుంటే  పాలనా అమరావతి నుంచే జరగాలని టీడీపీ భావిస్తోంది  అసలు పాలనా రాజధాని విషయమై హై కోర్ట్ ఏమంటోంది ? ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని గా ఏ ప్రాంతాన్ని పేర్కొనాలి  మూడు రాజధానుల ప్రతిపాదనకు హై కోర్ట్ సమ్మతిస్తోందా ?మరి న్యాయ రాజధాని, శాసన రాజధానుల సంగతేంటి..? రాజధాని తరలింపు కు ప్రభుత్వానికున్న అడ్డంకులేంటీ? ఈరోజు ప్రత్యేక కధనం లో తెలుసుకుందాం..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేసిననాటి నుంచి రాజధాని విషయమై వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి అయితే  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం  ఏపీ సచివాలయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, గవర్నర్ రాజభవన్, శాఖాధిపతుల కార్యాలయాలను విశాఖ కు తరలించి విశాఖను పాలనా రాజధాని గా కొనసాగించాలి హై కోర్ట్ ను కర్నూలు కు తరలించి కర్నూలు ను న్యాయ రాజధానిగా పేర్కొన్నారు అలాగే  శాసన సభ ను అమరావతి లో ఉంచి  అమరావతి ని లెజిస్లేటివ్ రాజధాని గా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే  ఇప్పటికే ఈ ప్రతిపాదనను మండలి తిరస్కరించింది కానీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను శాసనసభ కు పంపి అక్కడ ఆమోదం పొంది ఆ తరువాత గవర్నర్ నుంచి కూడా ఆమోదం పొందింది.
           అయితే ఈ బిల్ మండలిలో పెండింగ్ లో ఉన్న కారణంగా  ప్రతిపక్షం  వారు హై కోర్ట్ కు వెళ్లారు దీనితో రాజధాని తరలింపు పై హైకోర్ట్ స్టే ఇచ్చింది  విచారణ పూర్తి అయ్యే వరకు పాలనా విభాగాలను తరలించేందుకు వీలు లేదని పేర్కొంది  ఓ పక్కన  అమరావతి ని రాజధానిగానే కొనసాగిస్తామని చెబుతున్న వైసీపీ మరో వైపు సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, గవర్నర్ రాజభవన్, శాఖాధిపతుల కార్యాలయాలను విశాఖ కు తరలించాలని చూస్తోంది అసలు ఈ కార్యాలయాలు ఎక్కడ ఉంటె ఆ ప్రాంతాన్ని మాత్రమే రాజధానిగా పేర్కొంటాము. అసలు పాలనా రాజధాని , శాసన రాజధాని, న్యాయ రాజధాని అంటూ ప్రత్యేకమైన పదాలు రాజ్యాంగం లో లేవు..  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో  అమరావతి అనే పేరుతో ఉన్న ప్రాంతం లో ఇప్పుడు ఇవి ఉన్నాయి కనుక అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని గా ఉంది. ఇవి రేపు విశాఖపట్నానికి తరలి వెడితే అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుంది.

అమరావతి ని శాసన రాజధానిగా కర్నూలు ను న్యాయ రాజధాని గా పేర్కొన్న ప్రభుత్వం శాసన సభను అమరావతి లోను, హై కోర్ట్ ను కర్నూలు లోను కొనసాగించాలని నిర్ణయిస్తోంది. అయితే.. శాసన రాజధాని, న్యాయ రాజధాని వంటి పేర్లు పెట్టినంత మాత్రాన  అవి రాజధాని కింద గుర్తింపు కు రావు హైకోర్టు  లేజిస్లేచర్ లు ఎక్కడైనా ఉండొచ్చు. అవి రాజధానులు కావు. ప్రభుత్వ వెసులుబాటును బట్టి అవి ఎక్కడోచోట ఉంటాయి  న్యాయ రాజధాని,శాసన రాజధాని అనే పదాలు కూడా రాజ్యాంగం లో లేవు.  ప్రస్తుతం నడుస్తున్న వివాదం కూడా రాజధాని ఎక్కడా అనే గాని హైకోర్టు, శాసన సభా కార్యాలయం ఎక్కడా అనే విషయాలపై కాదు.
           ప్రస్తుతం అధికారికం గా హై కోర్ట్ అమరావతి లో ఉంది అంత గా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి  కోరుకుంటే కర్నూలు లోను విశాఖ లోను హై  కోర్ట్ బెంచ్ లను ఏర్పాటు చేయవచ్చు. హై కోర్ట్ బెంచ్ ఎక్కడ ఉంటె అక్కడ హైకోర్టు కూడా ఉన్నట్లే విశాఖ వాసులు గాని అటు రాయల సీమ వాసులు కానీ తమకు దగ్గర్లో ఉన్న బెంచ్ ని సంప్రదిస్తే సరిపోతుంది వారు హైకోర్ట్ కోసం అమరావతి వరకు రావాల్సిన అవసరం ఉండదు అసలు ఈ బెంచ్ ఏర్పాటును కూడా ఎవరు వ్యతిరేకించరు చాలా రాష్ట్రాల్లో హైకోర్టు ప్రధాన సీట్ ఒక చోట ఉంటే బెంచ్ లు వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ నే ఉదాహరణగా తీసుకుంటే అక్కడ రాజధాని లక్నో సచివాలయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, గవర్నర్ రాజ్ భవన్, డీజీపీ ఆఫీస్, శాఖాధిపతుల కార్యాలయాలు, అసెంబ్లీ -మొదలైనవన్నీ లక్నో లోనే ఉన్నాయి. కానీ అక్కడ హై కోర్ట్ అలహాబాదు లో ఉంటుంది హై కోర్ట్ తాలూకు బెంచ్ మాత్రం లక్నోలో ఉంది.

అలానే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా హై కోర్ట్ విజయవాడ లో ఉన్నప్పటికీ; దాని బెంచ్ లు విశాఖపట్నంలోనూ కర్నూల్ లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు బెంచ్ అనేది కూడా హైకోర్టుతో సమానమే అలాగే  శాసనసభ తాత్కాలిక భవనము వెలగపూడిలో ఉంది వాస్తవానికి అసెంబ్లీ సంవత్సరంలో ఓ యాభై రోజులపాటు జరిగి జరగనట్లు జరగుతుంది. కావాలంటే దానిని కూడా అక్కడ నుంచి తరలించే విషయం గురించి ప్రభుత్వం ఆలోచించుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని భావిస్తున్నది. అయితే రాజధానిని  తరలించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంది.
         
 ఒకటి హై కోర్ట్ ను మరొకటి సుప్రీమ్ కోర్ట్ అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించడం రాజ్యాంగ వ్యతిరేకంకాదని ప్రభుత్వం ఈ రెండు ధర్మాసనాల్లోనూ నిరూపించుకోవాల్సి ఉంది. అలా నిరూపించుకుంటేనే అన్న మాట ప్రకారం ప్రభుత్వం రాజధానిని తరలించడానికి వీలవుతుంది. ఈ లోపు కర్నూల్, విశాఖ లో హై కోర్ట్ బెంచ్ లను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు  చేపట్టితే బాగుంటుంది. రాయల సీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు కక్షిదారులను కర్నూల్ బెంచ్ కి; ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి ఈ నాలుగు జిల్లాల కక్షిదారులను  వైజాగ్ బెంచ్ కి పరిమితం చేస్తే మిగిలిన నాలుగు జిల్లాల వారు విజయ వాడ హై కోర్ట్ పరిధి లోకి వస్తారు. ఇలా చేయడం వలన హై కోర్ట్ అన్ని జిల్లాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇది కూడా చరిత్రాత్మకం గా మిగులుతుంది ఎన్నో ప్రభుత్వాలకు రాని పేరు విశాఖ ప్రభుత్వానికి వస్తుంది కర్నూల్ లో హై కోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యావంతులు 60 ఏళ్లుగా  ఆందోళనలు చేస్తున్నారు వారి కష్టాన్ని  గుర్తించిన ఘనత కూడా వైసీపీ సర్కార్ కు దక్కుతుంది.

అదండీ సంగతి.. హై కోర్ట్ తరలించే బదులు  విశాఖ లో, కర్నూలులో కూడా హై కోర్ట్ బెంచ్ లను ఏర్పాటు చేస్తే అన్ని జిల్లాల ప్రజలకు హైకోర్ట్ ను అందుబాటులోకి తెచ్చినట్లు అవుతుంది. ఇది ప్రభుత్వానికి చేతిలో పనే కాబట్టి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవ్వవు అసలు ఈ విషయమై పిటిషన్లు వేసే వారు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే.. హై కోర్ట్ ను అన్ని జిల్ల్లా ల ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే కాదనే వారెవరు. ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయపరమైన మహోపకారం చేసిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. మరి  ఈ రాజధాని వ్యవహారం ఎటు తిరిగి ఎటు వెళుతుందో తెలియాలంటే హై కోర్ట్ లో విచారణ పూర్తవ్వాలి  జగన్ ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ లో తరలింపు విషయం రాజ్యాంగ ఉల్లంఘన కాదని నిరూపించుకోగలగాలి ఇవన్నీ పూర్తవ్వాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.  మరిన్ని వార్తలు చదవండి : ఏపీలో మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన గవర్నర్..!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox