Breaking News

తాకట్టులో ఆంధ్రప్రదేశ్.. పవన్ కళ్యాణ్

08 th Oct 2021, UTC
తాకట్టులో ఆంధ్రప్రదేశ్..  పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఏపీ సర్కార్ పై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.  ఉచిత పధకాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని అదే సమయంలో  వారి నుంచి పన్నుల రూపంలో తిరిగి వసూలు చేస్తోందని ఆరోపించారు.

ఎన్ని వాగ్దానాలు చేసినా .. ఎన్ని అరుపులు అరిచినా.. రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా.. సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు. ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టుంది’అన్నారు.తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అన్న హెడ్డింగ్ తో రాష్ట్ర ఆర్దిక పరిస్దితిని వివరించారు.

వైసీపీ ప్రభుత్వం పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలకు ఉదారంగా ఇస్తున్నది రూపాయి అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక వద్ధి పావలా వంతు. విద్యుత్ బిల్లులు, నిత్యావసరాల ధరలు, ఇతర ధరల పెంపుతో ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నది రూపాయి బిల్లంత అయితే.. వైసీపీ ప్రభుత్వం భావితరాలకు ఇస్తున్న కానుక-అప్పులు, వడ్డీ, చక్రవడ్డీలు కోడిగుడ్డంత’ అంటూ పవన్ విమర్శించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox