Breaking News

ఆత్మహత్యల ప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్.. నారా లోకేష్

13 th Sep 2021, UTC

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో మండిపడ్డారు. ఫ్యాన్ క ఓటేస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగులు మోసపొవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయిందని  ఎద్దేవా చేసారు.

@  వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయింది. ఫ్యాన్ కి ఓటేస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత ఇప్పుడు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన యువకుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసింది. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న యువకుడు జగన్ రెడ్డి మోసానికి బలైపోవడం బాధాకరం.

వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇంకో యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలి. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు పోరాడి  ఉద్యోగాలు సాధిద్దాం అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox