Breaking News

జగన్మోహన్ రెడ్డి దెబ్బకు చంద్రబాబు కుప్పంలో తిరుగుతున్నారు.. అంబటి  రాంబాబు

26 th Feb 2021, UTC

కనీసంనామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లని చంద్రబాబుని జగన్ కుప్పం రప్పించారు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు బజారు బజారు తిరుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గొప్పదనం' అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భాం నుంచి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో కూడా వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది. కుప్పంలో టీడీపీ కేవలం 14 పంచాయతీలు మాత్రమే గెలిచింది. రాష్ట్రమంతా ఇలానే ఉన్నా చంద్రబాబు మాత్రం ప్రజస్వామ్యం ఓడిందంటున్నారని ఎద్దేవా చేసారు.

మున్సిపల్ ఎన్నికలు కూడా వదిలేసి చంద్రబాబు కుప్పంలో తిష్ట వేశారని, బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ బొమ్మలు పెట్టుకుని కుప్పంలో సైతం తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారానికి ​తీసుకెళ్లి, ఓడిన తర్వాత పక్కన పెట్టారని, చివరికి ఆయన సినిమాలు కూడా చూడవద్దని సూచించిన చంద్రబాబు. ఇప్పుడు ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకున్నాడని హేళన చేసారు.

భువనేశ్వరి గారికి సూచన చేస్తున్నా, మీ కుమారుడిని ఎవరికైనా చూపించండి. లోకేష్ ముఖ్యమంత్రి కావడం సాధ్యమయ్యే పని కాదు అని మీరన్నా గుర్తించండి. నారా వారి కుటుంబానికి మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లోకేష్ బాబాయిని చూస్తే తెలుస్తోంది. అందరూ ముఖ్యమంత్రుల కుమారులు ముఖ్యమంత్రులు కాలేరు. ఐడెంటిటీ క్రైసిస్ వల్ల లోకేష్ పదవీ కాంక్షతో మాట్లాడుతున్నట్లున్నారు' అని పేర్కొన్నారు. జనసేనకు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదని అంబటి రాంబాబు అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox