ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఎక్కువ గా విజృంభిస్తోంది.. ఇటీవల అక్కడ పలువురు ప్రముఖ రాజకీయ నాయకులూ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, వైసీపీ నేత అంబటి రాంబాబు కు కరోనా పాజిటివ్ గా తేలింది.. ప్రస్తుతం విజయ సాయి రెడ్డి అపోలో లో చికిత్స పొందుతున్నారు. అంబటి రాంబాబు కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.. ఈ విషయమై అంబటి స్పందించారు.
"ఇది నా ఆఫీషియల్ అకౌంట్ గా వెరిఫై అయిన విషయం గమనించగలరు" అని అంబటి తన ట్వీట్లో పేర్కొన్నారు. నాకు కరోనా వచ్చిన సంగతి అందరికి తెలుసనీ.. కార్యకర్తలు,అభిమానులు , శ్రేయోభిలాషులు , పెద్దల ఆశీస్సులతో కరోనా ని జయించి త్వరలో మీ ముందుకు వస్తానని అంబటి రాంబాబు ట్విట్టర్ మాధ్యమం ద్వారా తెలిపారు. ఈ పోస్ట్ చేయడానికి కొద్దీ సేపటి క్రితమే ఆయన ఓ వీడియో లో మాట్లాడారు. కరోనా పాజిటివ్ వచ్చినా తాను చాలా ధైర్యంగా ఉన్నానని, ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. ఐసోలేషన్ లో ఉన్నందున ఎక్కువమందికి ఫోన్ ద్వారా జవాబు ఇవ్వలేకపోతున్నానని అంబటి రాంబాబు వీడియో లో పేర్కొన్నారు.