ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత పదవులన్నీ సీఎం తన సొంత సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. నిత్యం ఎవరో ఒక రెడ్డికి పదవి కట్టబెడుతూనే ఉన్నారని, ప్రభుత్వ విప్‌లుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఒకే కులం నుంచి ఇంత మంది విప్లా? ఇక సీఎం కార్యాలయంలో కల్లం అజేయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి, ధనుంజయ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు.
పీపీఏ రివ్యూపై కమిటీని నియమిస్తే రాజేంద్రనాథ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, అజయ్ రెడ్డి, గోపాల రెడ్డి ఇక వైస్ చాన్స్లర్లు అదే కులం నుంచి లెక్కలేనంత మందిని నియమించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ రెడ్డి ఆస్తి నాకు, పాస్తి నీకు అన్నట్లు రెండు పదవులుంటే కీలకమైనది రెడ్డికి, ప్యూన్లాంటిది ఏ బీసీకో ఇతర కులాలకో ఇస్తున్నారు అని రఘురామ కృష్ణరాజు విమర్శించారు.
హిందూ మతంలో కులాలు ఉన్నాయి. కానీ, కులాలులేని క్రైస్తవ మతంలో జగన్ ఉన్నారు. కులరహిత మతంలో ఉండి కూడా మీ పేరు చివరున్న రెండు అక్షరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కులాలకు అతీతంగా పని చేస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ, జరుగుతున్నది పూర్తి విరుద్ధం అని అదే సమయంలో రెడ్లు అంటే తనకు ఎంతో గౌరవమని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.
రాష్ట్రపతి ఆమోదంతో ఏపీ పునర్విభజన చట్టం అమలులోకి వచ్చాక, మళ్లీ గవర్నర్ రాజధాని మార్పుకోసం ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను ఆమోదించడం రాష్ట్రపతి నిర్ణయాన్ని ధిక్కరించడమే అవుతుందని ఆయన వివరించారు. కొత్త చట్టం చెల్లదని, ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగి తీరుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నానని తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి : ఉన్న నమ్మకాలన్నీ నిమ్మగడ్డ మీదే:విజయసాయి రెడ్డి