Breaking News

గిద్దలూరు టీడీపీ లో అక్కా తమ్ముళ్ల కోల్డ్ వార్

24 th Nov 2021, UTC

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే,  టీడీపీ  రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిడితల సాయికల్పన రెడ్డి .. టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తుమూల అశోక్ రెడ్డిల మధ్య  కోల్డ్ వార్ మొదలైంది .. పిడితల సాయికల్పనకు సమీప బంధువైన అశోక్‌రెడ్డి ఆమెకు  వరుసకు తమ్ముడవుతారు ..  ప్రస్తుత గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా అశోక్ రెడ్డి కొనసాగుతున్నారు.అయితే గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమాలకి.. మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనను  అశోక్ రెడ్డి ఆహ్వానించడం లేదు.. ఇటీవల గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున  టిడిపిలోకి వలసలు మొదలయ్యాయి.. బెస్తవారిపేట మండలం కాజీపురానికి చెందిన ఓ వైసీపీ నేత తన అనుచరులతో టీడీపీలో జాయిన్ అయ్యారు.. ఆ కార్యక్రమానికి టీడీపీ నేతలు జిల్లా నలుమూలల నుండి హాజరవ్వగా.. స్థానిక మాజీ ఎమ్మెల్యే సాయికల్పనకు మాత్రం ఆహ్వానం అందలేదట. ఇలా నియోజకవర్గ పరిధిలో పార్టీపరంగా జరిగే ఏ కార్యక్రమానికి కూడా అశోక్ రెడ్డి.. సాయికల్పనను ఆహ్వానించకపోతుండటంతో...  ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైందని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది. 

అక్కాతమ్ముళ్ల మధ్య కోల్డ్ వార్ కి కారణం రానున్న ఎన్నికల్లో టికెట్ విషయమే అంటున్నారు..  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ నుండి సాయికల్పన లేదా ఆమె తనయుడు అభిషేక్ రెడ్డి  బరిలో ఉండలానీ పిడతల కుటుంబం , వారి అభిమానులు  గట్టిగా బావిస్తున్నారంట.. అశోక్ రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి... వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యారు. దాంతో ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన తడాఖా ఏంటో గిద్దలూరు నియోజకవర్గంలో చూపించాలన్న పట్టుదలతో ఉన్నారంట .. ఆ క్రమంలో నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి  వలసలకు శ్రీకారం చుట్టారు అశోక్ రెడ్డి.. తన యాక్షన్ ప్లాన్‌లో ఉన్న ఆయన పార్టీ బలోపేత కార్యక్రమాలకు సాయికల్సనను అహ్వనించడం లేదని  సమాచారం.

ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్‌కు ఇదే కారణమంటున్నారు .. అలా అక్కాతమ్ముళ్లు టికెట్ కోసం పోటీ పడుతుండటం టీడీపీ కేడర్‌ని గందరగోళానికి గురిచేస్తోంది.. అయితే అశోక్ రెడ్డి మాత్రం అక్కకి ఎమ్మెల్సీ ఇస్తారు.. తనకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని అని కార్యకర్తల దగ్గర చెబుతున్నారట. మొత్తానికి అక్క తమ్ముడి మధ్య కోల్డ్ వార్ ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox