Breaking News

బీజేపీలోకి రానున్న అర్చన..? సోము వీర్రాజుతో భేటీ..!

21 st Jan 2021, UTC

రాజమండ్రి :త్వరలోనే సీనియర్ సినీ నటి అర్చన బీజేపీలోకి చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీనియర్ సినీ నటి అర్చనని కలిశారు. ట్విట్టర్ మాధ్యమం ద్వారా ఇటీవలే ఈ విషయాన్నీ ఆయన వెల్లడించారు. 1988, 1989లలో సీనియర్ నటి అర్చన రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా, ఆమెను సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిశారు.

రాజమండ్రి కార్యాలయంలో ఆమెను కలిశారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చించినట్లు తెలిపారు. బీజేపీలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఉండగా, తాజాగా మరికొందరు వచ్చి చేరుతున్నారు. కొన్ని రోజుల క్రితమే బీజేపీ నేతలు చెన్నైలో ఉంటున్న వాణీవిశ్వనాథ్, ప్రియారామన్‌ను కలిసి పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో పదవులు ఇస్తామని వారికి చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా, సీనియర్ నటి అర్చనను కలవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఆమె కూడా బీజేపీ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox