Breaking News

నాడు ఎన్టీఆర్.. నేడు జగన్..!

08 th Aug 2020, UTC
నాడు ఎన్టీఆర్.. నేడు జగన్..!

ఆంధ్రప్రదేశ్  :ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచిప్రభుత్వ నిర్ణయాలను హై కోర్ట్ వ్యతిరేకించడం ఎక్కువగా జరుగుతోంది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ఎపి హై  కోర్ట్ ఇప్పటికే చాలా సార్లు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే,ప్రస్తుతం జగన్ సర్కార్ కు హై కోర్ట్ కు మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే హై కోర్ట్ తీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని  ఈసారి అటో ఇటో తేల్చేసుకోవాలని భావిస్తున్నారు.ఈ పరిస్థితిల్లో న్యాయ, శాసన వ్యవస్ధల మధ్య ఘర్షణ తప్పదా ? ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, హై కోర్ట్ కు మధ్య పరిస్థితులు ఎటు దారితీయనున్నాయి? టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఓ రాజ్యాంగం. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఓ రాజ్యాంగమా? అని ప్రశ్నిస్తున్న స్పీకర్ తదుపరి చర్యలేంటి?

         గత ఏడాది కాలంగా అధికారం లో ఉన్న వైసీపీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు హై కోర్ట్ అడ్డంకులు  పెడుతున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు హై కోర్ట్ ఆమోదం తెలపడం లేదు. ఆది లోనే హంసపాదు కావాల్సొచ్చినట్లు,సీఎం జగన్ తీసుకున్న ప్రతి  నిర్ణయానికి హై కోర్ట్ బ్రేకులు వేస్తోంది. ఈ విషయమై స్పీకర్ తమ్మినేని కూడా హై కోర్ట్ తీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హై కోర్ట్ తీరు విషయమై ఆయన సుప్రీమ్ కోర్ట్ కు వెళ్లడమే సరైనదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన చేసిన హెచ్చరికలు. హై కోర్ట్ విషయం తాడో పేడో తేల్చేందుకు సిద్ధం అయిపోయినట్లుగా అనిపిస్తున్నాయి. ముల్లుని ముల్లు తోనే తీయాలన్నట్లు, ఆయన న్యాయపరం గా ఎదురవుతున్న ఇబ్బందులకు కూడా సుప్రీమ్ కోర్ట్ ని ఆశ్రయించడమే సరైనదిగా భావిస్తున్నారు.

                ఇటీవల ఆయన మాట్లాడిన మాటలు చుస్తే,శాసన వ్యవస్ధకు ఉన్న అధికారాలపై మరోసారి విస్తృత చర్చ జరగడంతో పాటు న్యాయవ్యవస్ధతో మరో ఘర్షణ తప్పేలా లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్లో కోర్టుల జోక్యంపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇదే తరహా లో మరో సారి హై కోర్ట్ నుంచి వ్యతిరేక తీర్పు వస్తే,తాడో పేడో తేల్చుకోవాలని సిద్ధమైనట్లు తెలుస్తోంది.
              ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అధికారం లోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రతి పాదనను అత్యంత ప్రతిష్టాత్మకం గా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే. ఈ విషయమై హై కోర్ట్ వద్ద మాత్ర చుక్కెదురైంది. ప్రభుత్వంలో భాగమైన శాసన వ్యవస్ధకూ ఇది ప్రతిష్టాత్మకంగానే కనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఇప్పటికే రెండుసార్లు ఆమోదించి పంపిన రాజధాని బిల్లులకు కేంద్రంతో పాటు న్యాయనిపుణులు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. కానీ దీన్ని కోర్టులో సవాలు చేయడం, సెలక్ట్‌ కమిటీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో శాసనసభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

              ఇప్పటికే,కార్యనిర్వాహక, శాసన వ్యవస్ధలు ఆమోదించి పంపిన దస్త్రాలను రాజ్యాంగ నిబంధల పేరిట ప్రతిపక్షం లో ఉన్న టీడీపీ పార్టీ కోర్టు లలో ప్రశ్నిస్తోంది. ఈ విషయమై తమ్మినేని సీతారాం ఎంత ఆగ్రహానికిగురయ్యారో ఆయన మాటలలోనే తెలుస్తోంది. టీడీపీ పార్టీ వాదన కూడా రోజుకోరకంగా ఉంది. సెలెక్ట్ కమిటి రాజధాని బిల్లులను పెండింగ్ లో ఉంచిందని. మరో సారి అసలు సెలెక్ట్ కమిటీ ని ఏర్పాటు చేయలేదని వితండ వాదన చేస్తోంది. ఈ పరిస్థితిల్లో,హై కోర్ట్ మరో సారి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే,అసలు శాసన సభ కు సంబంధించిన అధికారాల గురించి ప్రస్తావన తీసుకురావాలని తమ్మినేని సీతారాం భావిస్తున్నట్లు తెలుస్తోంది. శాసన మండలి తనకి ఉన్న అధికారాలతో బిల్లుని ఆమోదిస్తే,ఆ బిల్లుల్ని సెలక్ట్ కమిటీ పేరిట అడ్డుకోవాలని చూడటం.చివరికి అది వ్యవస్ధల మధ్య ఘర్షణలకు దారి తీసే అవకాశాలు మెండు గా ఉంటాయనే వాదనను  తమ్మినేని తీసుకురావాలని  అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

            ప్రస్తుతం,ఉన్న పరిస్థితుల దృష్ట్యా,ఒకవేళ హై కోర్ట్ మరో సారి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే,శాసన సభ అధికారాలను తెరపైకి తీసుకురావడం ద్వారా హై కోర్ట్ తీర్పు ని స్పీకర్ తమ్మినేని  ప్రతిఘటించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇలా శాసన సభకు న్యాయ వ్యవస్థకు ఘర్షణ రావడం ఇది మొదటి సారి కాదు.గతంలో కూడా ఇలాంటి వి చోటు చేసుకున్నాయి. అయితే, అప్పుడు కూడా లౌక్యం తో రెండు వ్యవస్థలు వివాదాలను పరిష్కరించుకున్నాయి.

         అయితే,గతం లో ఇలా శాసన వ్యవస్థ కు, న్యాయ వ్యవస్థ కు మధ్య వివాదం వచ్చినపుడు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చట్ట సభల నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని,ఇది వరకు ఓ సారి అత్యున్నత న్యాయస్ధానం రాజారామ్ పాల్ వర్సెస్ లోక్‌సభ కేసులో స్పష్టం చేసింది. తరువాతి కాలంలో పలు చట్ట సభలు,తమ సభల్లో కోర్టు ల జోక్యం ఉండరాదని రూలింగ్ ను కూడా ఇచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 1997లో స్పీకర్ గా ఉన్న యనమల ఇదే రూలింగ్ ను ఇచ్చారు. ప్రస్తుతం కూడా ఈ రూలింగ్ అమలు లో ఉందని ప్రస్తుత స్పీకర్ తమ్మినేని చెప్పుకొచ్చారు. దానిని కొనసాగించాలనే విషయం టీడీపీ గుర్తుంచుకోవాలని, స్పీకర్ తమ్మినేని చేస్తున్న వాదన కూడా న్యాయసమ్మతంగానే ఉంది.

          ఏది ఏమైనా,ప్రస్తుతం ఎపి లో రాజకీయాలు కోర్టుల వద్ద రచ్చ రచ్చ చేస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ తరహాలోనే,జగన్ సర్కార్ కూడా ఈ విషయం పై సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. మూడు రాజధానుల వ్యవహారం లో మాత్రం జగన్ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ విషయం లో ఆయన న్యాయ నిపుణుల సలహాల మేరకే నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ విషయం లో సుప్రీమ్ కోర్ట్ గడప తొక్కారు.భవిష్యత్ ఏమి జరుగుతుందో చూడాలంటే,హై కోర్ట్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాలి. ఈ విషయమై. సుప్రీమ్ కోర్ట్ లో విచారణ జరిగే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox