ఆంధ్రప్రదేశ్ :నేడు రాఖి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఈ-రక్షాబంధన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మీడియా తో మాట్లాడారు. ఈరోజు చేసిన రెండుపనులు ఎంతో సంతోషాన్నిచ్చాయని సీఎం జగన్ అన్నారు.
ఈ-రక్షాబంధన్ కార్యక్రమం కంటే ముందు మహిళలకు చేయూతని ఇచ్చే విధం గా కీలక కార్యక్రమాలకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గేంబుల్, అమూల్ వంటి సంస్థల సహకారంతో బ్యాంకుల ద్వారా ప్రతి ఇంట్లో ఓ మహిళకు నాలుగేళ్ల పాటు నికర ఆదాయం వచ్చేలా కొత్త చర్యలు తీసుకురాబోతున్నామని జగన్ చెప్పుకొచ్చారు.
నేడు రాఖి పౌర్ణమి సందర్భం గా ఈ-రక్షాబంధన్ లోగోను ఆవిష్కరించిన జగన్ ఆ తరువాత మీడియా తో మాట్లాడారు. ఈ-రక్షాబంధన్ ఎంతో ఉపయోగపడుతుందని, ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ఎలా రక్షణ కలిపించాలన్న దానిపై నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు. మహిళల్లో అవగాహనను పెంచే దిశగా సదస్సులు చేపడుతామని అన్నారు. సైబర్ నేరాలకు గురయ్యే మహిళలకు సైబర్ మిత్ర యాప్ ద్వారా, లేక దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, లేకపోతే నిర్దేశిత టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జగన్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలకు ఇంత ప్రాముఖ్యత, గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇంకేదీ ఉండకపోవచ్చని జగన్ చెప్పుకొచ్చారు. మహిళలకు అన్నింటా 50 శాతం రిజర్వేషన్ తెస్తూ చట్టం చేశామని చెప్పారు. ఇవాళ ఆలయ కమిటీలకు, మార్కెట్ కమిటీలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారంటే,ఈ చట్టం వల్లనే అని ఆయన చెప్పుకొచ్చారు. అమ్మఒడి నుంచి ఆసరా, చేయూత వంటి పథకాలతో పాటు దేవుడు ఆశీర్వదిస్తే ఆగస్టు 15న 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వాలని సంకల్పించినట్లు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
03 Mar 2021