అవినీతిపరులపై సీఎం జగన్ యుద్ధం ప్రకటించారని దీనితో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావువ్యాఖ్యానించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ హయాంలో ప్రతి అవినీతి వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని అన్నారు.
అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీ అని, జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అంటున్నారని, ఈ పద్దతి సరికాదన్నారు. ఈఎస్ఐ నిధుల గోల్‌మాల్‌లో ఎవరెవరి పాత్ర ఉందో తెలియాల్సి ఉందన్నారు. ఈ విషయమై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని మరిన్ని విషయాలు బయట పడతాయని ఆయన అన్నారు.
అచ్చెన్నాయుడుపై ఇంత ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు.. ఆనాడు కోడెల శివప్రసాద్ మీద ఎందుకు చూపించలేదని వీరభద్ర రావు ప్రశ్నించారు. కోడెల మృతికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. అచ్చెన్నాయుడు బలహీన వర్గాల నాయకుడు కాదని, టీడీపీ నాయకుడు మాత్రమేనని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో టీడీపీ ఉనికిపైనా వీరభద్ర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ దయ వలనే టీడీపీ ఈ రోజు బతికి ఉందన్నారు. టీడీపీలో 22 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అయితే రాజీనామా చేసి పార్టీలోకి రావాలని జగన్ పెట్టిన షరతుతో టీడీపీ బతికి ఉందని వ్యాఖ్యానించారు

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
17 Jan 2021
16 Jan 2021
18 Jan 2021
18 Jan 2021
18 Jan 2021
19 Jan 2021