ఆంధ్రప్రదేశ్ :హిందూస్థాన్ షిప్‌యార్డులో క్రేన్ ప్రమాదం జరిగి 18 రోజులైంది. ఇప్పటివరకు దానికి బాధ్యులు ఎవరనేది తేల్చలేదు. ఎప్పటిలాగే ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు వేసినట్టే దీనికి కమిటీలు వేశారు. జిల్లా అధికార యంత్రాంగం నియమించిన కమిటీ నివేదికను సమర్పించేసింది. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, క్రేన్ డిజైన్‌లో లోపం వుందని, వేసిన బరువును కాయలేకపోయిందని ఏయూ ప్రొఫెసర్ల బృం దం పేర్కొంది. క్రేన్ ట్రయల్ రన్‌కు ముందు థర్డ్ పార్టీ తనిఖీ చేయాల్సి ఉందని, కానీ అటువంటి పత్రాలు ఏమీ లేవని ప్రకటించింది. సరైన పర్యవేక్షణ, నిబంధనలు పాటించకుండా ట్రయల్ రన్ నిర్వహించారని స్పష్టమైంది. ఈ నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది.
క్రేన్ ప్రమాదంపై షిప్‌యార్డు ఆపరేషన్స్ డైరెక్టర్ నేతృత్వంలో సంస్థకు చెందిన అధికారులతో మరో కమిటీని ఏర్పాటుచేశారు. వారికి ఈ క్రేన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం వుంటుందని, ఎక్కడ లోపం జరిగిందీ తెలుస్తుందని భావించి ఈ కమిటీని వేశారు. పారదర్శకంగా నివేదిక సమర్పిస్తామని సీఎండీ శరత్‌బాబు ఘటన జరిగిన రోజు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆ కమిటీ నివేదికను సమర్పించలేదు. ఈ నెల 31వ తేదీన సీఎండీ శరత్‌బాబు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ఆయనే ప్రధాన కారణమని, ఒత్తిడి తెచ్చి...నిబంధనలకు వ్యతిరేకంగా ట్రయల్ రన్ నిర్వహించారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రిటైర్ అయ్యేలోగా షిప్‌యార్డ్ కమిటీ నివేదిక ఇస్తుందా? లేదా? అనేది అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.
హిందూస్థాన్ షిప్ యార్డులో క్రేన్ ప్రమాదంలో పది మంది మృతిచెందగా ఒక్కొక్కరికి రూ.50 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలు, షిప్‌యార్డు రూ.35 లక్షలు సమకూరుస్తాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అదే రోజుప్రకటించారు. ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు రూపాయి కూడా ఇవ్వలేదని బాదిత కుటుంబీకులు చెపుతున్నారు.. నాలుగు రోజుల క్రితమే వారందరికీ ప్రత్యేకంగా నోటీసులు పంపించారు. పరిహారం కావాలంటే...ఆ కుటుంబం వారసులు పది రకాల సర్టిఫికెట్లు సమర్పించాలని, వాటిని పరిశీలించాకే సెటిల్మెంట్ చేస్తామని యాజమాన్యం పేర్కొంది. అందులో మరణ ధ్రువీకరణ పత్రం, శవపంచనామా నివేదిక, కుటుంబం వివరాలతో సర్టిఫికెట్, వారసులమని చెప్పే తహసీల్దార్ నివేదిక, నామినీ ఆధార్, రూ.100 స్టాంప్ పేపర్‌పై అండర్ టేకింగ్ లెటర్, నామినీ బ్యాంక్ పాస్‌బుక్, ఉద్యోగి రేషన్ కార్డు, నామినీ పాన్‌కార్డు...ఇలా మొత్తం పది రకాల పత్రాలు సమర్పించాలని సూచించారు.భర్త పోయి పుట్టెడు దుక్కంలో ఉన్న వీరికి అదనపు కష్టాలు వచ్చిపడ్డాయని మృతుని భార్య అంటోంది.
బైట్: మృతుని భార్య ఈ కరోనా సమయంలో ఈ సర్టిఫికెట్ల కోసం తాము ఎక్కడెక్కడికి తిరగాలి? అని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. సంస్థలో ప్రమాదం జరిగి, అధికారికంగా పోలీసులే శవ పరీక్షలు చేశాక...ఇంకా అది..ఇది అంటూ కాలయాపన దేనికని వారు ప్రశ్నిస్తున్నారు. సంస్థ దగ్గర వివరాలు లేవా? అని నిలదీస్తున్నారు. జిల్లా మంత్రి, కలెక్టర్ కలుగజేసుకొని ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఎలా పరిహారం ఇచ్చారో తమకూ అలాగే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox