Breaking News

పవర్ ఎక్కడుంటే ...గంట అక్కడ మోగుతుంది

01 st Oct 2020, UTC
పవర్ ఎక్కడుంటే ...గంట అక్కడ మోగుతుంది

గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఘనమైన రాజకీయ వారసత్వం వుండి ఏళ్ల తరబడి పార్టీల్లో వున్నవారికి రాని అవకాశాలుఆయనకు త్వరగా వచ్చాయి. చాల తక్కువ సమయంలోనే ఆయన ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేపట్టారు. తన సామాజిక నేపధ్యానికి తోడు వివిధ వర్గాల ప్రజలను ఎలా ఆకట్టు కోవాలనే దానిపై గంటాకు మంచి అవగాహన వుంది. అందువలనే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా , ఏ పార్టీ నుంచి పోటీ  చేసినా సునాయాసంగా గెలిచారు. రాజకీయ జీవితాన్ని ప్రారంబించిన టీడీపీ నుంచి మొదట ఎంపీగా, తరువాత ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే స్వతహాగా వ్యాపార వేత్త కావడంతో ప్రతీ దానికి ఆయన తన దైన శైలిలో లెక్కలు వేస్తారు. అధికారంలో లేకపోతే  ఏ పదవిలో వున్నా వేస్టని గంటా నమ్ముతారు. అందుకే ఎమ్మెల్యేగా వున్నప్పటికీ  2004 నుంచి 2009 వరకు  టీడీపీ ప్రతిపక్షంలో వుండటంతో ఆయన ఉక్కపోతను అనుభవించారు.  దీనితో మెగాస్టార్ చిరంజీవి ప్రారంబించిన ప్రజారాజ్యంలో చేరిపోయారు. అయితే ఆయన అంచనాలు తప్పాయి.

ప్రజారాజ్యం 18 సీట్లకే పరిమితమైంది. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవికి సన్నిహితుడిగా మెలగడంతో ఆయన దశ తిరిగిపోయింది. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రి కావడంతో రాష్ట్రంలో ఆయన వర్గానికి చెందిన కొంతమందికి మంత్రి పదవులు వచ్చాయి. వారిలో గంటా శ్రీనివాసరావుకు కూడ మంత్రి పదవి వచ్చింది. అప్పటట్లో అది విశాఖ జిల్లా కాంగ్రెస్ లో పెద్ద సంచలనం. ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లకే కష్టమైతే ఆయన ఏకంగా మంత్రి పదవినే కొట్టేసారు. అయితే తరువాత రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ నుంచి నాయకులు అందరూ అయితే జగన్ లేదా చంద్రబాబు చుట్టూ చేరిపోయారు. దీనితో ఒక మంచి ముహూర్తంలో గంటా చంద్రబాబును కలిసి పార్టీలో చేరిపోయారు.మరలా 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం గంటాకు మంత్రి పదవి. వీటిని బట్టి చెప్పవచ్చు ఆయన మంచి జాతకుడని.

నెల్లూరు జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు ఆంధ్రాయూనివర్సిటీలో లా చదివిన తరువాత ఒక దినపత్రిలో యాడ్స్  ఎగ్జిక్యూటివ్గా జీవితాన్ని ప్రారంభించారు. తరువాత కొంతమంది మిత్రులతో కలిసి పోర్టులో స్టీవ్ డోర్ కాంట్రాక్టర్గా అవతారమెత్తారు. అందులో బాగా కలిసి రావడంతో మిగిలిన వ్యాపారాల మీద దృష్టి పెట్టారు. 1999లో అనకాపల్లి నియోజక వర్గం నుంచి ఎంపీగా టీడీపీ టిక్కెట్ వచ్చింది. అప్పటికి ఆయన రాజకీయాలకు కొత్త. ఆయన పార్లమెంటరీ స్దానం పరిధిలో వున్న ఎమ్మెల్యేలు అప్పటికే రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో వున్నారు. అయితే గంటా వారి సాయం ఏ మాత్రం ఆశించలేదు. తన దైన ఎలక్షన్ మేనేజ్ మెంట్ తో ఎంపీగా ఘనవిజయం సాధించారు.అప్పటినుంచి గంటా పేరు జిల్లాలోమోగడం  మొదలయింది. తరువాత 2004లో మరలా టీడీపీ అధికారంలోకి వస్తుందని తాను మంత్రి పదవి చేపట్టాలని భావించి చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. అయితే ఆయన గెలిచినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే గా పోటీచేసి నాడు మంత్రిగా వున్న కొణతాల రామకృష్ణను ఓడించారు. అయితే మరలా సీన్ రిపీట్, ఆయన గెలిచినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే చిరంజీవి దయతో గంటా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. 2014లో మరలా భీముని పట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసారు.ఈ సారి ఆయనా గెలిచారు. రాష్ట్రంలో పార్టీ కూడ అధికారంలోకి వచ్చింది. మూడు సార్లు మూడు పార్టీలనుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం గెలవడం. విశాఖ జిల్లాలో ఈ రికార్డు గంటాదే. గంటా ఎక్కడినుంచి పోటీ చేసినా ఎలా గెలుస్తారు? ఇది పెద్ద టాపిక్. గంటాకున్న టీమ్ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి కులాలు, ఓటు బ్యాంకులను పూర్తిగా స్డడీ చేస్తుంది. ఎవరితో ఎలా డీల్ చేయాలో చేస్తుంది. అందుకే ఆయనకు  
ఓటమి అనేది లేకుండా పోయింది.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి అయ్యాక గంటా శ్రీనివాసరావు పై గతంలో ఎన్నడూ లేనంతగా ఆరోపణలు వచ్చాయి.పోస్టింగ్ లు, బదిలీలకు గంటా తరపున ఆయన మనుషులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. విశాఖ నగరం శివార్లలో, భీమిలి నియోజక వర్డంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడినట్లు కధనాలు వచ్చాయి. గంటా బంధువు భాస్కరరావు షాడో మంత్రిగా వ్యవహరించడం, ఆయనే సమీక్షలు చేయడం ఇవన్నీ సంచలనం కలిగించాయి. దానికి తోడు ఇండియన్ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని చెల్లించకపోవడం. ఇవన్నీ గంటా ప్రతిష్టను మసకబారేలా చేసాయి. 2019 లో విశాఖ ఉత్తర నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ టీడీపీ అధికారం కోల్పోయింది. మామూలుగానే అధికారం లేకపోతే ఉండలేని మనిషి. మరోవైపు ఆయన భూ ఆక్రమణలపై విచారణ జరిపి జైలుకు పంపుతామని వైపీపీ నాయకుల ప్రకటనలు. దీనితో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ గంటా అటువైపు తొంగి చూడటం మానేసారు. వైసీపీ పెద్దలతో మంతనాలు జరిపి పార్టీ మారిపోవాలని డిసైడయ్యారు. అయితే విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనువాస్ అడ్డుపడటంతో అది ఆగిపోయింది. మరలా మరి ఎవరిని పట్టుకున్నారో తెలియదు. శనివారం తన కొడుకు రవితేజకు సీఎం జగన్ తో కండువా కప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని విజయసాయిరెడ్డి అడ్డుకుంటారా? వదిలేస్తారా అన్నది చూడాలి. మరిన్ని వార్తలు చదవండి.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox