Breaking News

గోడ నిర్మాణం ఎప్పుడూ...?

21 st Aug 2020, UTC
గోడ నిర్మాణం ఎప్పుడూ...?

ఆంధ్రప్రదేశ్  :తూర్పుగోదావరి జిల్లాలో తాండవ నది పరివాహక ప్రాంతంలోని జీవనం కొనసాగిస్తున్నారు. తుని, రెల్లిపేటతో పాటు ఇసుకలపేట, చాపల మార్కేట్, పాయకరావుపేట తదితర ప్రాంతాలు. తాండవ నది పరివాహకం చుట్టూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు సాదాసీదాగా ఉన్నా, వర్షాకాలం వచ్చిందంటే చాలు. తాండవనది పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు, బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి. నదిలో నుంచి నీరు ఏ సమయంలో బయటకు వస్తాయో తెలియదు. ఒకవేళ వరద ఉధృతం పెరిగితే, ఉన్న ఫలంగా కట్టుబట్టలతో వీరంతా బయటకు వెళ్లాల్సిన వస్తుంది.

పదేళ్లలో రెండుసార్లు అతిపెద్ద వరదలు తాండవ పరివాహక ప్రాంత ప్రజలను ముంచేశాయి. దీంతో కట్టుబట్టలతో ఇక్కడున్న వారంతా ఇతర ప్రాంతాలకు తరలిపోవడం తగ్గుముఖం పట్టాక తిరిగి రావడం మామూలైపోయింది. ఈ పరిస్థితులను స్వయంగా చూసిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

జంట జిల్లాల సరిహద్దు ప్రాంతానికి ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ నేతలు సైతం హామీలు కురిపించారు. కానీ, ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో అన్న భయం మరలా జంటా జిల్లాల ప్రజల్లో కలవర పెడుతుంది. తాజాగా  తాండవ నదిలోక వరదనీరు చేరింది. కేవలం ఇది వర్షం నీరుగా చెప్పుకోవచ్చు. అయితే, విశాఖ జిల్లా నాతవరం సమీపంలో ఉన్న తాండవ డ్యాంలో అధికంగా వరద నీరు చేరడంతో అక్కడి గేట్లు ఎత్తివేస్తే ప్రమాదం పొంచి ఉన్నట్లేనని మనం చెప్పుకోవచ్చు. మరో రెండురోజులు ఇదే విధంగా వర్షాలు కురిస్తే ముంపు తప్పదని
విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఏది ఏమైనా, ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు అతి పెద్ద సమస్యగా భావించే తాండవ నది ప్రహరీగోడ నిర్మాణం, కనీసం ఇప్పుడున్న ప్రభుత్వమైనా ముందుకు రావాలని అక్కడి ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox