Breaking News

వైసీపీ విజయ సాయి రెడ్డి కి మరో కీలక పదవి..!

04 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ : వైసీపీ ఎంపీ,రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి లభించింది. ఇటీవలి కాలంలో రాజ్యసభ లో వైసిపి పార్టీకి బలం పెరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో అధికార పక్షంలో ఉన్న వైసీపీ పార్టీ కి 153 ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. రాజ్యసభలో కూడా నాలుగు స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో నాలుగవ అతిపెద్ద పార్టీగా వైసీపీ పార్టీ ఉంది.
         ఈ నేపథ్యంలో కీలకమైన రాజ్యసభ బీఏసీలో వైసీపీకి చోటు దక్కింది. ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఎంపీ గా కొనసాగుతూ,రాజ్య సభ సభ్యుడిగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డికి ఈ గౌరవం లభించింది. బీఏసీలో సభ్యుడిగా విజయసాయికి స్థానం లభించింది.కాగా,తెరాస పార్టీలో కూడా ఓ సభ్యుడికి  పదవి లభించింది. సబార్డినేట్ లెజిస్టేచర్ కమిటీ సభ్యులుగా బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, టీఆర్ఎస్ సభ్యుడు సురేశ్ రెడ్డి కి లభించింది.
            గతంలో రెండుగా ఉన్న వైసీపీ బలం. తాజాగా రెండు నుంచి ఆరుకి పెరిగింది. ప్రస్తుతం,వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యులుగా విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నత్వానీలు పదవిలో ఉన్నారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox