ఆంధ్రప్రదేశ్ : ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు. 1972జననాట్య మండలిని స్థాపించి,తన జానపద గేయాలతో పల్లెకారులతో పాటు గిరిజనులను వంగ పండు ఎంతగానో చైతన్యపరిచారు. తన జీవిత కాలంలో వందలాది ఉత్తరాంధ్ర జానపదాలకు వంగపండు గజ్జెకట్టారు. ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో వంగపండు ప్రఖ్యాతి చెందారు. అర్థరాత్రి స్వతంత్య్రం సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం మొదలైంది. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత కళారత్న పురస్కారం అందుకున్నారు.
వంగపండు పాట కాదు ప్రజల గుండె చప్పడు. అక్షరం ఉన్నంత వరకు వంగపండు ఉంటాడని ప్రజాగాయకుడు, విప్లవకవి గద్దర్ అన్నారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఘనత వంగపండుది అని ఆయన పేర్కొన్నారు.
వంగపండు మరణం ఉత్తరాంధ్ర కళాకారులకే కాకుండా జానపదానికే తీరనిలోటని ప్రజా గాయకుడు దేవిశ్రీ అన్నారు. వంగపండుతో తమ కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యముందని,ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో తాను ఉద్యోగం వదిలి ప్రజా గాయకుడిగా రాణించానన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తూ ఉత్తరాంధ్ర జానపదానికి వన్నెతెచ్చిన మహానుభావుడు వంగపండు అని అన్నారు.
ఉత్తరాంధ్ర జానపదం రాలిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి దగ్గర నుంచి వంగపండుతో తమకి ఎంతో సాన్నిహిత్యముందన్నారు. ఆయనది తమది పక్కపక్కనే ఊర్లని వంగపండు ప్రభావం తనలాంటి ఎందరో కళాకారులపై ఉందన్నారు. ఆయన మరణంపై వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నానన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 May 2022
26 May 2022
26 May 2022
26 May 2022