ఆంధ్రప్రదేశ్ :లోక కళ్యాణం కోసం రుషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసుడి మాదిరి
చంద్రబాబు చెడగొడుతున్నాడని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాష్ట్రంలో 40 ఏళ్ల అనుభవమున్న అతి భయంకరమైన రాక్షసుడు చంద్రబాబు అని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ పరితపిస్తున్నారని గుర్తుచేశారు. నూటికి నూరుశాతం ఇచ్చిన హామిలను నెరవేర్చుకోవాలని జగన్ తపన పడుతున్నారని అన్నారు.అన్ని పనులు సీఎం జగన్ చేసేస్తే ప్రజల గుండెల్లో దేవుడు అవుతాడనే భయం బాబుకు పట్టుకుందన్నారు. చంద్రబాబువి దుర్మార్గపు ఆలోచనలు అని, మహిళలను లక్షాధికారులు చేస్తానని చాలాసార్లు చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు.
తాము మహిళల పేరున ఇళ్ల పట్టాలు, హక్కులు కల్పిస్తుంటే సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. కోర్టులో కేసులు వేసి పెండింగ్లో ఉండేలా చేస్తున్నాడని విరుచుకపడ్డారు. ఇళ్ల పట్టాల పంపిణీ గాంధీ జయంతి నాడు కానీ, దసరాకు కానీ పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము అనుకున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసి తీరుతామని చెప్పారు. ఆరు నూరైనా డిసెంబర్ 21 సీఎం జగన్ పుట్టిన రోజు నాటికి ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని ఆయన తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి.