ఆంధ్రప్రదేశ్ : విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరగడం హృదయవిదారకమని జనసేన అధినేత
పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారని తెలిసి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కరోనా వైరస్‌తో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినవారు ఈ విధంగా ప్రమాదం బారినపడటం అత్యంత విషాదమన్నారు. మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రమేశ్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా హోటల్లో నడుస్తున్న ఈ కోవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొంటే అత్యవసర మార్గాల ద్వారా బయటపడే వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఈ ఘటనకు కారణాలు ఏమిటి? లోపాలు ఏమిటో సమగ్ర విచారణ చేయించాలి.
ఈ ఘటన నేపథ్యంలో వివిధ హోటల్స్, భవనాల్లో నడుస్తున్న కోవిడ్ కేంద్రాల్లో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలి అని ప్రభుత్వాన్ని పవన్ కోరారు.
మరిన్ని వార్తలు చదవండి.