Breaking News

ఆ పైలట్ మరణం నన్ను కలచి వేసింది : పవన్ కళ్యాణ్

09 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :కేరళలోని కోజికోడ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన విమాన ప్రమాదంలో అశువులు బాసిన వవారి కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విమాన ప్రమాద ఘటనలో ఇద్దరు పైలట్లు, 17 మంది ప్రయాణికులు దుర్మరణం చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ప్రయాణం చివరి నిమిషాల్లో ఊహించని ప్రమాదం జరగడం విధి వైపరీత్యమని పవన్ పేర్కొన్నారు. గల్ఫ్ నుంచి ప్రయాణం చేసినవారు మాతృభూమిపై కాలు మోపే లోపలే మృత్యువు ప్రమాదం రూపంలో కాటు వేసిందన్నారు. విమానాన్ని నడిపిన వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్‌ విమాన పయానంలో ఎంతో అనుభవం ఉన్న పైలట్లు అని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ విమానం ప్రమాదానికి గురవడం దురదృష్టకరమని చెప్పారు.
 
ముఖ్యంగా వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే గతంలో భారత వాయుసేనలో చిరస్మరణీయ సేవలు అందించారని పవన్ గుర్తు చేశారు. వ్యక్తిగతంగా కూడా తనకు ఆయన తెలుసన్నారు. ఈ ప్రమాదంలో ఆయన కూడా దుర్మరణం పాలవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. వాయుసేనలో సాథే అందించిన సేవలు, చూపిన ధైర్య సాహసాలు ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox