నిన్న అచ్చెన్నాయుడు... నేడు జేసీ ప్రభాకర రెడ్డి.. ఏపీలో టీడీపీ నేతల అరెస్ట్ లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని
శంషాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు అతని తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వారిని తరలిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు జేసీ అస్మిత్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీ ఇన్సూరెన్స్‌ల వ్యవహారంలో జేసీ అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వాహనాలకు ఇన్సూరెన్స్ చెల్లించకుండానే...చెల్లించినట్
జేసీ ప్రభాకర రెడ్డి వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేయగా కిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్ ఎన్ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి.
జేసీ ప్రభాకర రెడ్డి ఏం చేసారు?
అశోక్ లేలాండ్ కంపెనీ ఉత్పత్తి చేసిన బీఎస్–3 లారీలను తుక్కు (స్క్రాప్) కింద విక్రయించగా.. వాటిని జేసీ బ్రదర్స్ కంపెనీ కొనుగోలు చేసింది.
వాటిలో 98 లారీలను నాగాలాండ్‌లో, 32 లారీలను ఏపీలో, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో 24 లారీలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు.
ప్రస్తుతం ఈ 154 లారీల్లో ఏపీలో 101, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మరో మూడు లారీలు గుర్తించాల్సి ఉంది.
వీటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన మొత్తం లారీలను బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్‌కు లేఖ రాశారు.
రవాణా శాఖ అధికారులు జాతీయ డేటాబేస్ ‘వాహన్’ నుంచి ఈ రిజిస్ట్రేషన్లు తొలగించాలని కోరారు. ఏపీలో గుర్తించిన 101 లారీల్లో 95 లారీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశామని, మిగిలిన ఆరు లారీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తెలిపారు.
ఇందులో 80 లారీలు అనంతపురం, 5 కర్నూలు, మరో 5 చిత్తూరు, కడపలో 3, గుంటూరులో 2 చొప్పున ఉన్నాయి. లారీల బీమా పత్రాలను పరిశీలించగా.. అవి కూడా నకిలీవేనని తేలాయి. యునైటెడ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర బీమా కంపెనీలకు అధికారులు సమాచారం ఇచ్చారు
అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన లారీలను జటాధర కంపెనీ ప్రతినిధులు వివిధ జిల్లాల్లో విక్రయించారు. కొనుగోలు చేసిన వారు తాము మోసపోయామని గుర్తించి జేసీ బ్రదర్స్ కంపెనీపై చీటింగ్ కేసులు పెట్టారు.
వారిని జేసీ బ్రదర్స్ సంప్రదించి వ్యవహారం సెటిల్ చేసుకునేందుకు రూ.12 నుంచి రూ.14 లక్షలు తిరిగి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు అధికారుల దృష్టికి వచ్చింది.
ఈ వ్యవహారానికి సంబంధించి జటాధర కంపెనీ డైరెక్టర్లు జేసీ ఉమాదేవి, అస్మిత్ రెడ్డి, సి.గోపాలరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
26 Jan 2021
28 Jan 2021
28 Jan 2021