Breaking News

జగన్ మతంపై స్వామి సరూపానంద స్ఫష్టత ఇవ్వాలి.. ఎంపీ  రఘురామ కృష్ణంరాజు

24 th Sep 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :జగన్మోహన్ రెడ్డి స్వామిజీల చుట్టూ తిరిగి గంగలో స్నానం చేసి, ఎన్నికల ముందు ప్రచారం చేసుకున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ హిందు మతానికి తిరిగివచ్చారని వైసీపీ ప్రచారం చేసి నమ్మించిందన్నారు. ముఖ్యమంత్రికి మార్గదర్శనం చేస్తున్న స్వరూపానంద. ఆలయాలపై దాడులు ఆపేందుకు దారి చూపితే బాగుంటుందని రఘురామ అన్నారు. ఇప్పటి వరకు హిందువులే జగన్ విషయంలో అయోమయంలో ఉన్నారని, తిరుమలలో జగన్‌ను చూసి క్రిస్టియన్లు కూడా కన్ఫ్యూజన్‌లో పడ్డారని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అసలు జగన్ ఏ మతం, ఏమనుకుంటున్నారనేది స్వరూపనంద ఒక్కరే చెప్పగలరేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు. దానిపై ఇప్పటికైనా స్పష్టత ఇస్తే మంచిదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రే నిబంధనలను తుంగలో తొక్కితే.. ఈ ప్రభుత్వం ఇచ్చే జీవోలపై ఎవరికి మర్యాద ఉంటుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో తిరుమలలో అందరూ మాస్కులు పెట్టుకున్నారని, సీఎం జగన్ మాత్రం పెట్టుకోలేదన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను సీఎం పాటించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది చూసిన ప్రజలు కూడా నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రే తమకు ఆదర్శమని అంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని అభిమానించే ప్రజలే.. ఆయనపై వేలుపెట్టి చూపిస్తే దానికి జగన్ ఏం సమాధానం చెబుతారని రఘురామ నిలదీశారు.మంత్రి గాని.. వేరే ఎవరైనాసరే మన ఇంట్లో పెట్టుకున్న ఇష్టమైన వ్యక్తులు, లేక దేవుళ్ల ఫోటోలపై ఎవరైనా ఉమ్మి వేసి.. ఫోటోయేకదా ఇంకొక ఫోటో ఇస్తాలే అని అంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఏమౌతుంది అంటే ఇది అంతేనని రఘురామ అన్నారు.దేవాలయాల్లో విగ్రహాలను పగులగొట్టి ఇంకొకటి పెడదామని, రథం దగ్ధం అయితే కొత్తది వస్తాదని అంటే సరికాదని రఘురామ అన్నారు. ఇలాగే ఉంటే.. ప్రజలు తిరగబడి తగిన విధంగా బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుందన్నారు. కొడాలి నాని ప్రధాని మోదీ, సీఎం యోగిపై
వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అసలు వాళ్ల గురించి తెలుసుకోకుండా దుర్భాషలాడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox