Breaking News

సుప్రీం కోర్టులోనూ రంగు పడింది..!

03 rd Jun 2020, UTC
సుప్రీం కోర్టులోనూ రంగు పడింది..!

రంగులపై సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించాలని జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది.

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. జస్టిస్ లావు నాగేశ్వర్‌రావుతో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రతివాది సూర్యదేవర వెంకట్రావు తరపున గుంటూరు ప్రేరణ, ప్రమోద్‌ వాదించారు. ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హైకోర్టు తీర్పు అమలు చేయలేదని వాదించారు.

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీలకు వైసీపీ పార్టీ రంగులేస్తున్నారంటూ మొదట ఫిర్యాది కోర్టుకు వెళ్ళినపుడు దాన్ని సరిదిద్దుకోవలసిన సర్కార్ వున్న రంగులకు అదనంగా మట్టిరంగను జతపరిచింది. దీనిపై మరలా కోర్టుకు వెళ్లగా ప్రభుత్వాన్ని మందలించిన హై కోర్టు రంగులను తొలగించాలని తమ ఆదేశాలను ధిక్కరించిడంపట్ల  అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినా సర్కార్ వెనక్కి తగ్గలేదు.. మరలా సుప్రీం కోర్టును  ఆశ్రయించింది. అయినా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి చిన్న చిన్ని విషయాలపై ప్రతిష్టకు పోకుండా, అధికారులను ఇబ్బంది పెట్టకుండా వుంటే బాగుంటుందని పలువురు అంటున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox