ఆంధ్రప్రదేశ్ : ఉత్తరాంధ్రలో చారిత్రాత్మక దేవాలయమైన సింహాచలం అప్పన్నఆలయ అబివృద్దికి కృషి చేస్తున్న మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజుపై కేంద్రం బుధవారం ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది.
11వ శతాబ్దానికి చెందిన
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయ అభివృద్దికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాలు అభివృద్ది చేసేందుకు కేంద్రం "ప్రసాద్" పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్రంలో శ్రీశైలం, తిరుపతి దేవస్థానాలను ఇప్పటికే ఈ పథకం కింద ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ది చేస్తున్నారు. సింహాచలం దేవస్దానానికి విజయనగరం సంస్దానాదీశులయిన పూసపాటి వంశీయులు వంశపారంపర్య ధర్మకర్తలు గా వున్నారు.
దివంగత పూసపాటి ఆనందగజపతి రాజు కుమార్తె అయిన సంచయిత గజపతి రాజును సింహాచలం దేవస్దానం వంశపారంపర్య ధర్మకర్తగా ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.అంతేకాదు ఆమె తన వంశీయుల మాన్సాస్ ట్రస్ట్ కు కూడ చైర్మన్ గా కొనసాగుతున్నారు.
మరిన్ని వార్తలు చదవండి.