ఆంధ్రప్రదేశ్ :ఆంధ్రప్రదేశ్ లో భూముల సమగ్ర రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వం
గ్రామ సచివాలయ వ్యవస్థలో కొత్తగా నియమించిన 11,158 మంది గ్రామ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత వీరిని రీ సర్వేకి వినియోగించుకుంటారు. మలేషియా, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో అమల్లో ఉన్న కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీతో మన రాష్ట్రంలో రీ సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో రీ సర్వే పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన నివేదికను రెవెన్యూ శాఖ ఈనెల 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించనుంది. ప్రయోగాత్మకంగా చేసిన రీ సర్వేలో ఎదురైన అనుభవాలు, వచ్చిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా కచ్చితత్వంతో రీ సర్వే చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దీనిపై ఈనెల 21న రెవెన్యూ అధికారులతో సీఎం సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1.63 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో అటవీ విస్తీర్ణం పోగా రీ సర్వే చేయాల్సిన విస్తీర్ణం 1.22 లక్షల చదరపు కిలోమీటర్లుగా అధికారులు నిర్ణయించారు.
మరిన్ని వార్తలు చదవండి.