కరోనా మహమ్మారి కారణం గా విద్యార్థులు గత అయిదు నెలలు గా పాఠశాలలకు దూరం గా ఉన్నారు.. భౌతిక దూరం పాటించాల్సి ఉండడం. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం తో కరోనా బారి నుంచి విద్యార్థులను సేఫ్ గా ఉంచడం కోసం లాక్ డౌన్ మొదలవగానే స్కూళ్లను, కాలేజీ లను మూసివేశారు.. పరీక్షలు సైతం రద్దు చేస్తూ వచ్చారు.. అయితే.. ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. మంగళవారం క్యాంపు కార్యాలయం లో సమీక్షా నిర్వహించిన సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి తిరిగి పాఠశాలలను ప్రారంభించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు ఆయన నాడు-నేడు పనులను పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఆగష్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి అయి తీరాలని ఆదేశాలు జారీ చేసారు. ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ విషయం పై కూడా జగన్ చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగష్టు 15 న ఇళ్ల పట్టాల పంపిణి జరగాలని .. ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు.