ఆంధ్రప్రదేశ్ :చంద్రబాబు హయాంలో విశాఖ ఎలా అభివృద్ధి చెందిందో విజయసాయిరెడ్డితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి
అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. విశాఖలో జీవీఎంసీ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.1400 కోట్ల బకాయిల సంగతేంటో విజయసాయి చెప్పాలి. ప్రజలను తప్పదారి పట్టించేలా అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పంటలు వేసినా రైతులకు ఎరువులు అందుబాటులో లేవు. రైతులకు ఎప్పుడు ఏది కావాలో ప్రభుత్వం గుర్తించడం లేదు. వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు, వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం నియమించిన సలహాదారుడు నాగిరెడ్డి సమస్యపై దృష్టిపెట్టాలన్నారు.
ప్రభుత్వం ఉద్యానవన పంటల సాగుపై దృష్టిపెట్టిన రైతులను కూడా ఆదుకోవాలి. వారికి సబ్సిడీపై రుణాలు, యంత్రపరికరాలు, సాగు సామగ్రి అందచేసి ప్రోత్సహించాలి. 56 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అవి ఎక్కడున్నాయో ఆయనే కరోనా రోగులకు చెప్పాలి. చికిత్స లేకపోయినా ఉందని, పడకలు లేనప్పుడు ఉన్నాయని ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పడం తగదు. ప్రజలు కరోనాతో చనిపోతుంటే వారి ప్రాణాలతో చెలగాటమాడటం జగన్ చేయాల్సిన పనికాదు అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
మరిన్ని వార్తలు చదవండి.