Breaking News

ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలో తెలుసా..?

01 st Aug 2020, UTC

రాఖీ పౌర్ణమి :  సోదరీసోదరుల అవిభాజ్యమైన ప్రేమకు గుర్తు. అన్నాచెల్లెళ్లు, అక్కా,తమ్ముళ్ల మధ్యనున్న ప్రేమను చాటి చెప్పేందుకు చేసుకునే పవిత్రమైన పండగ. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ,తన రక్షణను కాంక్షిస్తూ ప్రతి సోదరి అన్న లేదా తమ్ముడికి రాఖీ కడుతారు. అయితే  జోతిష్య శాస్త్ర ప్రకారం ఆయా రాశులకు సంబంధించి మీ సోదరుడి రాశి ప్రకారం కొన్ని రకాల రంగుల్లో ఉన్న రాఖీని తన చేతికి కడితే తనకు అదృష్టం కలిసి వస్తుందని కొందరు జ్యోతిష్యులు చెబుతున్న మాట. మరి ఏ రాశి వారికి ఎలాంటి రాఖీ కడితే మంచిదో ఇప్పుడు ఓసారి తెలుసుకుందాం.
           అనుబంధాల హరివిల్లు ప్రేమాభిమానాల పొదరిల్లు, గిల్లికజ్జాల సరదాలు, తోడు నీడగా సాగిన జీవితాలు కాలం మారినా, దూరం పెరిగినా,చెరగని బంధాలు,అవే అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల  అనుబంధాలు. ఆ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగే రక్షాబంధన్‌. రక్ష’ అంటే రక్షించడం, ‘బంధన్’ అంటే సూత్రం కట్టడం అని అర్థం. అన్న లేదా తమ్ముడు జీవితాంతం తనకు తోడూ నీడగా ఉండాలని కోరుకుంటూ ఓ సోదరి కట్టే కంకణమే రాఖీ. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అమ్మలా లాలించి, నాన్నలా ఆదరిస్తానని సోదరుడు బాస చేసే సందర్భమే రాఖీ పండుగ.
          అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే ఈ రాఖీ పండుగ. సోదరుడి చేతికి రాఖీ కట్టి..తను పది కాలాల పాటు చల్లగా ఉండాలంటూ మనసారా కోరుకునే వ్యక్తి సోదరి. అలాగే తనకు రాఖీ కట్టిన సోదరిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకునేలా వాళ్లిద్దరి మధ్య ఉండే ప్రేమ బంధాన్ని రాఖీ పండుగ గుర్తు చేస్తుంది. . అందుకే దీన్ని రక్షాబంధన్ అని పిలుస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే రాఖీ పండుగకు ఎంతో విశిష్టత ఉంది.‘రాఖీ’ ఎప్పుడు పుట్టింది.
           నిజానికి కాలంతో పాటు పరుగులు తీస్తున్న నేటి బిజీ లైఫ్‌లో మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని గుర్తుచేసేది రాఖీలాంటి పండగలే. మారిన జీవనశైలిలో భాగంగా పలకరింపుల్లో తేడాలు వచ్చాయి. ఒకరినొకరు నేరుగా చూసుకోలేనంత దూరాలూ పెరిగాయి. కానీ ఆప్యాయతానురాగాల్లో మాత్రం తేడా వద్దంటూ ఇలాంటి సందర్భాలు చెబుతాయి. అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని మరింత గాఢంగా ముడివేస్తూ ఏడాదికోమారు జరుపుకునే అనుబంధాల వేడుక రక్షాబంధన్‌. సోదరీసోదరులు సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించుకునే సందర్భం. చేతులకు కట్టేది ఏ రంగు దారమైనా ఆప్యాయాతానురాగాలనే ప్రదర్శిస్తుంది. అయితే ఆయా రాశులకు సంబందించి మీ సోదరుడి రాశి ప్రకారం కొన్ని రకాల రంగుల్లో ఉన్న రాఖీని కడితే,వారికి మరింత క్షేమకరంగా ఉంటుందన్నది కొందరు పెద్దలు చెబుతున్న మాట.
            మరి రాశుల వారీగా రాఖీ రంగుల విషయానికి వస్తే ముందుగా మేషం, ఈ రాశికి అధిపతి కుజుడు. ఒకవేళ మీ సోదరుడు ఈ రాశికి చెందినవారైతే వారికి ఎరుపు లేదా పసుపు రంగు దారం ఉన్న రాఖీ కట్టండి. ఇది వారికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఆ శక్తి వారి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపించి వారు అన్నింటా ముందుకెళ్లేలా చూస్తుంది. కేవలం రాఖీ కట్టడమే కాదు. ఈ పండగ సందర్భంగా మీ సోదరుడికి ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉన్న దుస్తులు లేదా బహుమతులు అందిస్తే ఇంకా బాగుంటుందట.
         ఇక వృషభ రాశికి అధిదేవత శుక్రుడు. అందుకే ఒకవేళ మీ సోదరుడు ఈ రాశిలో పుట్టిన వారైతే వారికి నీలం, బూడిద రంగులో ఉన్న రాఖీలను కట్టండి. మీకు వీలుంటే వెండి రాఖీని కొని కట్టడం ఇంకా మంచిది. ఇది మీ సోదరుడి జీవితాన్ని మార్చేస్తుందన్నది జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న మాట.
        ఇక మిథునరాశి వారి విషయానికి వస్తే,మిథునరాశికి  అధిపతి బుధుడు. ఈ రాశిలో పుట్టినవారి కోసం ఆకుపచ్చ, ఎరుపు, గంధం రంగులో ఉండే రాఖీలను ఎంచుకోవడం వల్ల మీ సోదరుడికి ఎప్పుడూ సుఖశాంతులు కలుగుతాయట.
        కర్కాటకం,ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడికి గుర్తుగా తెల్లని ముత్యాలతో కూడిన రాఖీని లేదా వెండితో తయారుచేసిన రాఖీని కట్టడం వల్ల మీ సోదరుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడట. కేవలం రాఖీ కట్టడం మాత్రమే కాదు. తెలుపు లేదా క్రీం రంగులో ఉన్న దుస్తులు లేదా బహుమతులు కూడా అందించడం వల్ల కేవలం అప్పుడే కాదు. సంవత్సరం మొత్తం మీ సోదరుడు ఆనందంగా ఉంటారట.

ఇక సింహ రాశికి అధి దేవత సూర్యుడు. అందుకే సూర్యుడిని తలపించేలా వీరి రాఖీ రంగు కూడా ఎరుపు లేదా గులాబీ రంగుల్లో ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు ఈ రోజు మీ సోదరుడు ఇష్టపడే బహుమతులు ఏవైనా,ఈ రంగుల్లో ఉండేలా చూసుకొని వారికి అందిస్తే మీ బంధం జీవితాంతం అంతే బలంగా ఉంటుందట.
         కన్యా రాశికి అధిపతి బుధుడు. అందుకే ఈ రాశి వారికి ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న రాఖీ తీసుకొచ్చి కట్టాలట. అంతేకాదు ముత్యంతో చేసినవి,గంధం రంగులో ఉండేవి కూడా తీసుకోవచ్చు. ఆకుపచ్చ రంగు బహుమతులు మీ సోదరుడు ఆనందంగా ఉండేలా చేస్తాయట.
          ఇక తులరాశి విషయానికి వస్తే.. తుల రాశి అధిపతి శుక్రుడు. మీ సోదరుడు ఈ రాశిలో పుట్టిన వారు అయితే తనకి నీలం, టర్కోయిస్, పర్పుల్ రంగుల్లో ఉండే మంచి రాఖీలను వెతికి అందించడంతో పాటు. తెలుపు, బూడిద వర్ణాల్లో ఉండే ఏదైనా బహుమతిని కూడా ఇవ్వడం వల్ల వారు సంవత్సరమంతా ఆనందంగా ఉంటారంటున్నారు.
        వృశ్చికం,ఈ రాశి అధిదేవత కుజుడు. అందుకే మీ సోదరుడు ఈ రాశి వారైతే,వారికి ఎరుపు రంగులో ఉన్న రాఖీ కట్టండి. లేదా ముత్యంతో కూడినది కట్టినా బాగుంటుంది. అంతేకాదు. ఈ పండగ రోజు వారికి ఇచ్చే బహుమతి తెలుపు రంగులో ఉండేలా చూసుకోండి. ఇది మీ సోదరుడి జీవితంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుందట.
      ధనుస్సు, ఈ రాశికి అధిపతి గురుడు. అందుకే ఈ రాశివారికి పసుపు, గంధం రంగుల్లో ఉండే రాఖీ కట్టడం వల్ల వారు సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారట. అయితే వీరికి బహుమతులు ఇచ్చేటప్పుడు మాత్రం ఎరుపు రంగువి ఇవ్వండి. దీనివల్ల వారి కెరీర్ చాలా విజయవంతంగా సాగిపోతుందట.
     మకర రాశి అధిపతి శని. అందుకే ఈ రాశి వారికి నీలం రంగు రాఖీ కట్టడం వారి శ్రేయస్సుకు ఎంతో మంచిది. అంతేకాదు,ఆ శని దేవుడిని మీ అన్న లేదా తమ్ముడిపై ఎప్పుడూ వరాల వర్షం కురిపించాలని కోరుకుంటూ పూజ చేయండి. ఈ సంవత్సరం వారి జీవితంలో ఎన్నో సంతోషకరమైన విషయాలు జరుగుతాయంటున్నారు.
    కుంభం,ఈ రాశికి అధిపతి శని కావడం వల్ల, ఈ రాశిలో పుట్టిన మీ అన్న లేదా తమ్ముడికి నీలం రంగు రాఖీని కట్టండి. ఇది వారి జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది.
       చివరిగా మీన రాశికి అధిపతి గురుడు. అందుకే ఈ రాశిలో పుట్టిన మీ సోదరుడు ఆనందంగా ఉండేలా అతడికి పసుపు రంగు రాఖీ కట్టండి. అంతేకాదు,తెలుపు రంగులో ఉన్న దుస్తులు లేదా ఇతర బహుమతులు అతడికి ఇవ్వడం వల్ల వారి కష్టాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరు పెద్దలు చెబుతున్న మాట.  అయితే ఏ రంగు రాఖీ కట్టినా, ఎలాంటి రాఖీ కట్టినా అది తోబుట్టువుల మధ్య ఎనలేని ప్రేమానురాగాలు, ఆప్యాయతానురాగాలకు నిదర్శనమే. కానీ రాఖీ పండుగ అనేది కేవలం ఈ ఒక్కరోజుకే పరిమితమైన ప్రేమానుబంధమూ కాదనేది మాత్రం ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox