Breaking News

ఎంపీ రఘురామా రాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

06 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :ఎంపీ రఘురామకృష్ణరాజు  భద్రతా కావాలంటూ, కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తనకు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ముప్పు ఉందంటూ, భద్రతా అందించాలని కేంద్రానికి ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాసిన సంగతి విదితమే. కాగా, రఘురామకృష్ణంరాజు అభ్యర్థనకు కేంద్రం స్పందించింది. ఆయనకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది.
           ఈ విషయమై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు మాట్లాడారు. తనకు వై  కేటగిరి భద్రతా లభించినట్లు నిన్న రాత్రి తెలిసిందని చెప్పారు. కాగా, ఈరోజు అధికారికం గా లేఖ వచ్చే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. ఈ కేటగిరి భద్రత కింద కనీసం పదిమంది తనకి సెక్యూరిటీ గా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ ఉందని, కర్ఫ్యూని సడలించిన తర్వాత వస్తానని రఘురామ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు.
          ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడతానని రఘురామ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేల విషయమై తానూ ఫిర్యాదు చేసానని, అయితే, అందులో వాస్తవాలను పరిశీలించిన తరువాతే, కేంద్రం తనకు భద్రతను కల్పిస్తోందని ఆయన స్పష్టం చేసారు. తన విన్నపాన్ని మన్నించినందుకు రఘురామ కృష్ణమరాజు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox