Breaking News

మూడు రాజధానుల ప్రకటన పై పవన్ కళ్యాణ్ కీలక సమావేశం..!

01 st Aug 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్ :ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయం ఇప్పటివరకు స్పష్టత లేదు. తాజాగ గవర్నర్ రాజధాని బిల్లుకు ఆమోదం తెల్పడంతో రాజధాని  తరలింపుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసేసుకుంటోంది. గవర్నర్ రాజధాని బిల్లుకు ఆమోదం ఇచ్చిన తరువాత నుంచి ఏపీలో  రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆగష్టు 15 తేదీ ని పునస్కరించుకుని విశాఖ లో రాజధానికి శంకుస్థాపన చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది.
          మరో వైపు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఏపీలో ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపధ్యం లో రేపు కీలక సమావేశాన్ని నిర్వహించాలని  జనసేన భావిస్తోంది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం టెలి కాన్ఫరెన్స్ ద్వారా జరగబోతోంది. ఇందులో ఇతర నాయకుల నుంచి రాజధాని విషయమై అభిప్రాయాలను సేకరిస్తారు. భవిష్యత్ లో ఆచరించాల్సిన  పనుల గురించి చర్చిస్తారు. అమరావతి రైతులకు ఎలా అండగా ఉన్నాలన్న విషయమై జనసేన ఆలోచనలు చేస్తుంది. ఆ తరువాత భవిష్యత్ కార్యాచరణ పై జనసేన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox