Breaking News

చంద్ర‌బాబు అవ‌కాశ‌వాది : ఒమ‌ర్ అబ్దుల్లా

30 th Jul 2020, UTC

న్యూఢిల్లీ : చంద్ర‌బాబు అవ‌కాశ‌వాది అని జ‌మ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా విమ‌ర్శించారు. ఢిల్లీలో ఆయ‌న బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు కోసం త‌న తండ్రి ఫ‌రూఖ్ అబ్దుల్లా త‌న సొంత ఎన్నిక‌లు వ‌దులుకొని ఏపీకీ ప్ర‌చారానికి వెళ్లార‌ని గుర్తుచేశారు. ఏపీలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్లీన్‌స్వీప్ చేస్తారని తెలిసినా,త‌న తండ్రి బాబు త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డానికి వెళ్లార‌న్నారు.

బాబు ఓడిపోతున్నార‌న్న విష‌యం ఆయ‌న‌కు త‌ప్ప అంద‌రికి తెలుస‌న్నారు. కానీ తాము హౌజ్ అరెస్ట్‌లో ఉన్న‌ప్పుడు మాత్రం చంద్ర‌బాబు క‌నీసం ఒక్కమాట మాట్లాడ‌క‌పోగా క‌నీస మ‌ద్ద‌తుగా ఒక ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేక‌పోయార‌న్నారు. అందుకే చంద్ర‌బాబు న‌మ్మ‌ద‌గిన నేత కాదంటూ అబ్దుల్లా మండిప‌డ్డారు.

ఒమర్‌ అబ్దుల్లా మార్చి నెలలో నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్‌ సేఫ్టీచట్టం కింద ఆయనను 8నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. 370అధికరణ కింద జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్‌ హౌస్‌ హరినివాస్‌లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా 221రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox