Breaking News

ఏపీ ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ..

03 rd Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం ఉదయం  బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని రాగద్వేషాలకు అతీతంగా ఎస్‌‌ఈసీ పనిచేస్తుందన్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నానన్నారు. శుక్రవారమే హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించానని,జిల్లా కలెక్టర్లకు తెలిపానన్నారు.

గతంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలో కరోనావ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్ సర్కార్,ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కానీ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. తాజాగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

నిమ్మగడ్డ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా,కోర్టు గవర్నర్‌ను కలిసి చర్చించాలని సూచించింది. దీంతో బిశ్వభూషణ్ హరిచందన్‌ను నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సమావేశమయ్యారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. దీనితో  నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

మరిన్ని రాజకీయ వార్తలు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox