Breaking News

ఏపీలో పొలిటికల్ రగడ..!

10 th Jun 2020, UTC
ఏపీలో పొలిటికల్ రగడ..!
ఒకవైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే మరో వైపు ఏపీలో రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు . తాజాగా జగన్ ప్రభుత్వం ఏడాది పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ నిప్పులు చెరిగారు.
పాలన ప్రారంభం అయినప్పటి నుంచి నవ స్కామ్‌లు, నవ అబద్ధాలు, నవ విధ్వంసాలు, నవ రాజ్యాంగ ధిక్కరణలు, నవ మానవ హక్కుల ఉల్లంఘనలు, నవ మల్లింపులే జరిగాయని ఆరోపించారు . సోమవారం జగన్ ఏడాది పాలనపై విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరుతో టీడీపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయ నాయకులు వివిధ పథకాలను తీసుకొస్తారని.. కానీ ముఖ్యమంత్రి జగన్ కాస్త డిఫరెంట్ అంటూ లోకేష్ సెటైర్లు వేశారు. కేవలం స్కామ్‌లు చేసేందుకే జగన్ స్కీమ్‌లు తీసుకొస్తున్నారని ఆరోపించారు.
గడిచిన ఏడాదిగా జరిగిన కుంభకోణాల గురించి చర్చించాలంటే ఇంకో సంవత్సరం కావాలని లోకేష్ ఎద్దేవా చేశారు.
  జగన్ పరిపాలన దరిద్రంగా ఉందని వైసీపీ కార్యకర్తలే అంటున్నారని లోకేష్ చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చింది రైతు భరోసా పథకం కాదు రైతు దగా అని అన్నారు. ఏడాది కాలంలో 564 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా జగన్ నెరవేర్చలేదన్నారు లోకేష్. పెన్షన్లు  వెయ్యి రూపాయలు పెంచుతామన్న జగన్..  250 మాత్రమే పెంచి మోసం చేశారని లోకేష్ మండిపడ్డారు. చీప్ లిక్కర్ కు జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని విమర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ఇసుకను పాలసీల పేరుతో దూరం చేశారని సీరియస్ అయ్యారు.  10వేల రూపాయల ఇసుకను  50వేలకు అమ్ముతున్నారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. ప్రస్తుతం విద్యుత్ వైరు పట్టుకుంటే షాక్ కొట్టడం లేదని, కరెంటు బిల్లు చూస్తే షాక్ కొడుతోందని లోకేష్ ఎద్దేవా చేశారు. కరోనా టెస్టింగ్ కిట్లు, బ్లీచింగ్ పౌడర్ పేరుతో కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపణలు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఒక వీడియోని కూడా విడుద‌ల చేశారు. పాదయాత్రలో ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్‌ నిధులను అమ్మవడికి మళ్లించారని, 83లక్షల మంది విద్యార్థులుంటే వారిని 43లక్షలకు కుదించి అమ్మవడిని అర్థవడిగా మార్చేశారన్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు 60మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఇసుక దొరకడం లేదని వైసిపి నేతలే చెబుతున్నారన్నారు.    
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని ఉద్దేశించి ‘జీరో సీఎం’ అంటూ అభివర్ణించిన నారా లోకేష్‌, రాష్ట్రంలో ‘రాజారెడ్డి రాజ్యాంగం’ అమలవుతోందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక, ‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్‌’ పుస్తకం విషయానికొస్తే, మొత్తం 20 పేజీల నిడివితో ఈ పుస్తకాన్ని విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్క్‌లు అడిగి వార్తల్లోకెక్కిన డాక్టర్‌ సుధాకర్‌.. ఈ పుస్తకం కవర్‌ పేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో చోటు దక్కించుకోవడం గమనించదగ్గ విషయం.
‘ప్రజా వేదిక’ కూల్చివేత వ్యవహారాన్ని కూడా కవర్‌ పేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో వాడారు. సిమెంటు ధరలు, ఇసుక కొరత, విద్యుత్‌ ఛార్జీల షాక్‌.. ఇలాంటి వ్యవహారాలన్నిటినీ ‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్‌’ పుస్తకంలో టీడీపీ ప్రస్తావించింది. ఇక , ఈ పుస్తకం ద్వారా...  టీడీపీ హయాంలో తెరపైకొచ్చిన అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతిని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ రద్దు చేయడంపైనా టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది . 
ఇక, తమ హయాంలో ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడుకునేదనీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, అరాచకాల గురించి అంతా మాట్లాడుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆరోపించారు. ‘నవ స్కాంలు – దోచుకో, దాచుకో, ‘జె’ ట్యాక్స్‌’ అంటూ రాష్ట్రంలో హల్‌చల్‌ చేస్తున్న చిత్ర విచిత్రమైన మద్యం బ్రాండ్ల వ్యవహారాన్ని ప్రస్తావించింది టీడీపీ.
‘నవ రాజ్యాంగ ధిక్కరణలు – రౌడీ రాజ్యం’ అనే పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో జరిగిన పరిణామాలతోపాటు, న్యాయస్థానాలు జగన్‌ సర్కార్‌కి వేసిన మొట్టికాయల వ్యవహారాన్ని కూడా పుస్తకంలో పేర్కొన్నారు. మొత్తమ్మీద, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పోరులో మరో ముందడుగు పడినట్లే కన్పిస్తోంది. నిజానికి, ఈ తరహా పుస్తకాల వ్యవహారం ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిందేమీ కాదు. గతంలో చంద్రబాబు మీద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇదే తరహాలో పుస్తకాల్ని ప్రచురించిన విషయం అందరికీ తెలిసిందే .   ఇక , నారా లోకేష్ ఏమన్నారో ఇప్పుడోసారి చూద్దాం.
 
ఇక , తాజాగా సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలనపై రాష్ట్రమా మేలుకో... పేరు మీద  ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఒక వీడియోను విడుదల చేశారు. 90  శాతం హామీలు నెరవేర్చారో.. మోసాలకు పాల్పడ్డలో ప్రజలే చెబుతారని పేర్కొన్నారు. స్కీములు రద్దులు, పేర్లు మార్పులు, జీవో రద్దు చేయడం తుగ్లక్ చర్యలే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాలకుల అవినీతి, అసమర్థత రాష్ట్రానికి కీడు చేస్తుంటే అడ్డుకోవాల్సింది ప్రజలే అని అన్నారు.   తెలుగుదేశం 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా గ్యాంగ్ వార్‌లు జరిగాయా? అని ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టంచిన బెజవాడ గ్యాంగ్ వార్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. నేరగాళ్ల పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి వైసీపీ అరాచకాలే రుజువని పేర్కొన్నారు. మోసగాళ్లు అధికారంలోకి వస్తే అన్నీ మోసాలేనని, దగాకోరుల రాజ్యంలో అన్నివర్గాల ప్రజలకు దగానేనని విమర్శించారు బాబు.  ఇక , విధ్వంసానికి ఒక్క చాన్స్‌ పేరుతో వైసీపీ ఏడాది పాలనను విమర్శిస్తూ టీడీపీ విడుదల చేసిన చార్జ్‌షీట్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. జగన్ పాలనపై లోకేశ్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. జగన్‌ను విమర్శించే స్థాయి, నైతిక హక్కు లోకేశ్‌కు లేదన్నారు. ఏడాది పాలనలో 90 శాతంపైగా హామీలు అమలు చేసిన వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్‌ అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఓటమికి కారణం లోకేశే అన్నారు మంత్రి అవంతి. నాయకులు ప్రజల నుంచి రావాలి, వారసత్వం నుంచి కాదని లోకేశ్‌ను ఉద్దేశించి అన్నారు. లోకేశ్ నాయకత్వాన్ని ఎవరూ కోరుకోవడం లేదన్నారాయన.
అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామని  తెలిపారు. కరోనా సమయంలోనూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటి దగ్గరే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. జూలై 8న 27 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.
 
ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఎపుడూ విమర్శలు చేసే వైసీపీ నేత, ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు  , నారా లోకేష్ లను పెదబాబు చిన్న బాబు అంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ఈ లాక్ డౌన్ కారణంగా వీరిద్దరూ ఎక్కువ సమయం కలిసి గడిపారు అని వ్యాఖ్యానించారు. అంతేకాక చినబాబు ఎందులోనూ మంచికి రాడు అన్న విషయాన్ని పెదబాబు గ్రహించారు అని, అలానే పెదబాబు అన్నిట్లో చెడ్డవాడు అనే విషయాన్ని చినబాబు గ్రహించాడు అని వ్యాఖ్యానించారు. అయితే ఇపుడు విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టిడిపి నేత, ఎంపీ కేశినేని నాని స్పందించారు. వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులు ఇచ్చారు. A1 మరియు A2 లుగా సంవత్సర కాలం పైన జైలు లో కలిసి ఉన్న మీరిద్దరూ ప్రజా ధనం దోచుకోవడానికి మాత్రమే పనికి వస్తాం అనే నిర్ణయానికి వచ్చారా అంటూ కౌంటర్ ఇచ్చారు. విజయ సాయి రెడ్డి, జగన్ లను ఇలా పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ, టిడిపి తారాస్థాయి లో ఒకరి పై మరొకరు విమర్శలు చేస్తూ ఉండగా, వీరిరువురు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. ఇక , విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య కౌంటర్‌ ఇచ్చారు. 'విజయసాయిరెడ్డి గారు.. మీకు వెటకారం పాలు జాస్తి అయింది. వెటకారం పెరిగితే, అవమానమే  మిగిలేది. నిన్న మా లోకేశ్ ప్రెస్ మీట్ చూచి, మీరు కంగుతిన్నారు గదా? మీ నాయకుడు ఎప్పుడు బయటకు వచ్చి యిలాంటి ప్రెస్ మీట్ పెడతారని ఆలోచించి, గతి తప్పి, వెటకారం జోడిస్తున్నారు కదూ? లోకేశ్ మాటలు తూటాలే కదూ?' అని చురకలంటించారు.
 
సంక్షోభాలు కొన్నిసార్లు కొంతమందికి అద్భుతమైన అవకాశాల్ని ఇస్తుంటాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు అలాంటి అవకాశమే లాక్ డౌన్ కల్పించిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. అందునా.. అనుకోని రీతిలో హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో.. తనకు లభించిన సమయాన్ని లోకేశ్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఎందుకంటే.. లాక్ డౌన్ వేళ కఠిన నిబంధనల్ని పాటించి ఏకంగా పదిహేను కేజీల బరువు తగ్గిన లోకేశ్ ... భౌతికంగానే కాదు.. ఆయనలో చాలానే మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు. దగ్గర దగ్గర నెలన్నరకు పైగా ఆయన ఇంట్లోనే ఉండాల్సిన వేళలో ఏం జరిగిందో కానీ.. లోకేశ్ "రూపం" లోనే కాదు.. మాటలోనూ చాలానే తేడా వచ్చేసినట్లుగా తెలుగు తమ్ముళ్లు అదే పనిగా చెప్పుకుంటున్నారు.
నోరు విప్పి నాలుగు మాటలు మాట్లాడితే చాలు.. ఏదో ఒక తప్పు దొర్లటం.. సోషల్ మీడియాలో కామెడీ చేసుకోవటానికి అవసరమైన కంటెంట్ ఇచ్చేస్తారన్న పేరున్న లోకేశ్.. తన తీరుకు భిన్నంగా తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాన్ఫిడెంట్ గా ఉండటమే కాదు.. మాట్లాడిన తీరు.. ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు సరికొత్తగా ఉన్నాయని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన పూర్తి అయిన నేపథ్యంలో ‘విధ్వంసానికి ఒక్క చాన్స్’ శీర్షికతో ఇరవై పేజీల చార్జిషీట్ విడుదల చేశారు చినబాబు. ఆ సందర్భంగా జగన్ ప్రభుత్వ తప్పిదాలు.. వైఫల్యాలు.. ఆరాచకాలంటూ ఏకరువు పెట్టిన ఆయన.. ఏడాదిలో  87వేల కోట్ల అప్పులు చేయటమే కాదు.. రాష్ట్ర ప్రజలపై  50వేల కోట్ల భారాన్ని మోపినట్లుగా చెప్పారు.
చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన 34 సంక్షేమ పథకాల్ని రద్దు చేసినట్లు ఆరోపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను తెలుగు సరిగా మాట్లాడకపోవటాన్ని తనకు తానే ప్రస్తావించి.. జగన్ ప్రభుత్వం మీద చేసిన విమర్శ చూస్తే - చినబాబు మాటల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. తాను ఇంగ్లిషు మీడియంలో చదువుకొన్నానని.. తెలుగులో చదవకపోవటంతో తానిప్పుడు తెలుగు సరిగా మాట్లాడలేక విమర్శలు ఎదుర్కొంటున్నానని.. తాను చేసిన తప్పు ఎవరూ చేయొద్దన్న లోకేశ్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
తన లోపాన్ని తన ప్రత్యర్థిపై అస్త్రంగా వాడాలన్న ఆలోచన చూస్తే.. లోకేశ్ లో రాజకీయ పరిణితితో పాటు చతురత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంగ్లిషు మీడియంను ప్రమోట్ చేస్తున్న ముఖ్యమంత్రి.. అమ్మభాషను నిర్లక్ష్యం చేస్తే.. కీలక స్థానాల్లో ఉండి కూడా మాట పడాల్సి వస్తుందని.. చులకన కావటం ఖాయమన్న విషయాన్ని లోకేశ్ తన మాటలతో స్పష్టం చేశారని చెప్పాలి.
ఇంతకీ.. ఈ మార్పు  ఎలా సాధ్యమైంది? అన్నది అసలు ప్రశ్న. చుట్టూ నిరాశ. అంతకు మించిన దారుణ ఓటమి. చేతిలో తిరుగులేని అధికారం నుంచి ఏమీ చేయలేని దైన్యం. మరోవైపు ప్రత్యర్థి చెలరేగిపోతున్న వేళ.. ఇప్పుడేమీ చేయకుంటే ఇంకెప్పటికి చేయలేమన్న విషయం అర్థం కావటమే కాదు.. తాను మారకుంటే .. తననే మార్చేసే రాజకీయాన్ని లోకేశ్ బాగానే అర్థం చేసుకున్నట్లుంది.
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు చిన్న ఎన్టీఆర్ తోనే అన్న వాదనకు పుల్ స్టాప్ పెట్టాలంటే తాను మొత్తంగా మారాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది . దీనికి సంబంధించి కసరత్తు ఎంత తీవ్రంగా సాగిందనటానికి పదిహేను కేజీల బరువు ఒక ఉదాహరణ అయితే.. తాజా ప్రెస్ మీట్ ను చినబాబు హ్యాండిల్ చేసిన వైనంతో ఇట్టే అర్థమైపోతుందంటున్నారు విశ్లేషకులు.
 
అసలు  జగన్ ఏడాది పాలన పూర్తయిన కొద్ది రోజుల నుండే , పొలిటికల్ సర్కిల్స్ లో అనేక విశ్లేషణలు సాగుతున్నాయి . 
మొత్తంగా చుస్తే ... జగన్ ఏడాది పాలనలో విజయాలు , వైఫల్యాలు ఉన్నప్పటికీ - కొద్ది రోజుల క్రితం ప్రైమ్9 నిర్వహించిన సర్వేలో మెజారిటీ ప్రజలు జగన్ ఏడాది పాలన బాగుందన్న అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే . 
 ఈ 12 నెలల పాలనలో .... జగన్ తీసుకున్న వాలంటీర్ , గ్రామ , వార్డు సచివాలయ వ్యవవస్థల ఏర్పాటు నిర్ణయంతో చెప్పిన మాట ప్రకారం 3 లక్షల 75 వేల వాలంటీర్లను నియమించి ప్రతి ఒక్కరు 50 కుటుంబాల కు ప్రభుత్వం తరుపున పూర్తి భాద్యత వహించేలా చేసారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటుచేసి, ప్రతి గ్రామానికి అన్ని విభాగాలకు జవాబుదారీగా ఉండేలా 11 మంది ఉద్యోగులును నియమించారు.. దీని ద్వారా లక్షా 40 వేల ఉద్యోగాలు కల్పించారు. వాలంటీర్ల నియామకాలు పార్టీ కార్యకర్తలకే ఇచ్చారనే అపవాధులు వచ్చాయి.. సచివాలయ ఉద్యోగాల ఎంపిక మాత్రం పారదర్శకంగా జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు వ్యవస్థలే ప్రభుత్వానికి పట్టుకొమ్మలుగా మారాయి. ప్రజల సమాచారమంతా వాలంటీర్ల ద్వారా సేకరించి దానికి సాంకేతికతను జోడించడం వలన, ఏది కావాలన్నా డోర్ డెలివరీ చేసే పరిస్థితికి తీసుకురావడం మంచి ఫలితాలిస్తున్నాయి.
ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్ తొలి ఏడాదంతా ప్రజా సంక్షేమం పైనే దృష్టి పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన తేదీలకు అన్నీ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక , మద్య మద్యలో తీసుకుంటున్న కొన్ని పాలసీలు, నిర్ణయాలు ఊహించని వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి..
జగన్ ఏడాది పాలన కొంచెం ఇష్టం ..కొంచెం కష్టం .. కొంత అదృష్టం, మరికొంత దురదృష్టం అన్న చందంగా తయారైంది. అప్పటికప్పుడే గ్రాఫ్ పైకి పెరగడం .. అంతలోనే తరిగిపోవడం పరిపాటైంది. వ్యవసాయమే జీవనాధారంగా సాగుతూ దేశానికి వెన్నుముకగా నిలిచే రైతాంగానికి - రైతు భరోసా క్రింద అందించిన సాయం మంచి మైలేజి తెచ్చిపెట్టింది. రైతులకు సకాలంలో పెట్టుబడులకు ఉపయోగపడేలా మూడు విడుతల్లో 13 వేల 5 వందల సాయం అందడంతో 45 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరింది. ఇలా ఐదేళ్లు భరోసా ఇస్తారనే నమ్మకం రైతుల్లో నాటుకుంది.
పిల్లల చదువే పేరెంట్సు కు భారం అవుతుందని , చదివించలేక చదువుకు స్వస్తి చెప్పకుండా అక్షరాస్యతను పెంచాలనే లక్ష్యంతో అమ్మ ఒడి పథకం ప్రకటించారు. ఎంత మంది సంతానం ఉన్నా తల్లి పేరుతో పదిహేను వేల రూపాయలు బ్యాంకు ఖాతాలకు జమచేసారు. అమ్మ ఒడి తల్లులకా పిల్లలకా అనే సందేహాలు వెల్లివిరిసాయి. తల్లులకు మాత్రమే అని నిర్దారించి లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చారు. అయితే ప్రభుత్వం పెట్టిన కరెంటు వినియోగం, భూ పరిమితి, ఆదాయ పరిమితుల్లాంటి కొన్ని కండీషన్ల వలన కొంతమంది తల్లులు అనర్హులుగా మిగిలిపోయారు. దీంతో ప్రభుత్వం పై కొంత మేర వ్యతిరేకత బయటపడింది.
నవశకం పేరుతో బియ్యం కార్డు , ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్ పత్రాల జారీల పేరిట చేసిన సర్వేల వలన - కరెంటు వాడకం అధికం పేరిట , ఎంతో మంది పించన్ దారులు, రేషన్ కార్డుదారులు అనర్హుల జాబితాలోకి రావడంతో రాష్ట్రమంతా గగ్గోలు పెట్టారు. తిరిగి రీ సర్వే చేసి సరిచేసేంత వరకు ప్రభుత్వం పై జనం పెట్టిన శాపనార్దాలు అన్నీ ఇన్నీ కావు. పించన్ ను 2 వేల 250 కు పెంచడమే కాకుండా ప్రతి ఏటా 250 పెంచే నిర్ణయం , అగ్రిగోల్డు బాధితులకు ఇచ్చిన హమీ మేరకు 264 కోట్ల చెల్లింపులు చేసి, దీర్ఘ కాలిక సమస్యను కొంత మేరకు పరిష్కరించారు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ , పారిశుద్య కార్మకులు, ఆశావర్కర్లు, హోంగార్డుల జీతాల పెంపు మరువలేనివి. ఆర్టీసి విలీనం ఆయా సంస్థలో పనిచేసే 53వేల ఉద్యోగుల కుటుంబాల దశాబ్దాల కల నెరవేర్చింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలింది. ఆటో డ్రైవర్లకు వాహాన మిత్ర క్రింద 2 లక్షల 36 వేల మందికి - పదివేల చొప్పున సాయం విశ్వాసాన్ని పెంచింది. ఇంగ్లీషు మీడియం పై మిశ్రమ స్పందన లభించగా పీజు రీఎంబర్సు మెంట్ ప్లస్ అయింది. ఇక , ఇసుక సరఫరా కోసం కొత్త పాలసీ పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఇసుక తవ్వకవాల నిలిపివేత నిర్ణయం తీవ్రమైన వ్యతిరేకత తెచ్చిపెట్టింది.. మూడు నెలల పాటు భవణ నిర్మాణ రంగంతో పాటు , అనుభంద రంగాల కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపింది.. వ్యాపారాలు మందగించాయి. ఇదే సమయంలో పరిపాలన వికేంద్రీకరణ , మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ నిర్ణయం ప్రజల్లో అసంతృప్తి జ్వాలను రగిల్చింది.
 
జగన్ ఏడాది పాలనలో... కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజల్లో మంచి పేరు పొందుతున్న సమయంలో - ఇసుక, రాజధాని వ్యవహారాలు దుమారం రేపాయి. ప్రజల నాడి పసికట్టిన ప్రతిపక్షాలు ప్రభుత్వం పై పోరాటాలు సలిపాయి. దీంతో ప్రోగ్రెస్ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ గా మారింది. అంశాల వారిగా పేరు ప్రతిష్టలను కొలమానికం వేయాల్సి వచ్చింది. దీనికితోడు పాలనలో తీసుకున్న అనేక నిర్ణయాలపై కొందరు పబ్లిక్ పిల్సు వేయడం కోర్టు అక్షింతలు వేయడం కూడా మైనస్ మార్కులకు దారితీస్తుంది. అన్నా క్యాంటీన్ల మూసివేత కూడా ఇప్పటికీ కొంతమందిలో నిరాశ నిట్టూర్పు మిగిల్చింది .సచివాలయాలకు రంగులు వేసే అంశంలోనూ , స్ఖానిక సంస్తల ఎన్నికల ప్రక్రియలో జరిగిన పరిణామాలు, ఏకగ్రీవాల తీరు - వ్యతిరేకితను పెంచాయని చెప్పక తప్పదు. మద్యం రేట్ల పెంపు , షాపుల కుదింపు కూడా ట్యాక్సు పేయర్సు లో అసమ్మతిని రగుల్చుతోంది. పృకృతి తెచ్చిన కరోనా మహమ్మారి కూడా ప్రత్యక్షంగా కాని , పరోక్షంగా కాని ప్రభుత్వానికి ప్రతికూలత మిగిల్చిందని చెప్పవచ్చు . అయితే కరోనా నివారణ చర్యల్లో ముఖ్యమంత్రి , ప్రభుత్వయంత్రాంగం తీసుకున్న చర్యల పట్ల తొలిరోజుల్లో దుష్ప్రాచారం జరిగినా - చివరకు ఏపీ అనుసరించిన తీరు ముఖ్యమంత్రి జగన్ చెప్పిన నికార్సైన నిజాలను, ముక్కుసూటిగా చెప్పిన మాటలను నేడు అందరూ హర్షిస్తున్నారు.
నామినేషన్ల పదవుల్లో రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మకంగా మిగిలిపోయింది. పవర్ ను షేర్ చేసినందుకు రిజర్వేషన్ వర్గాలు జేజేలు కొట్టాయి. అసెంబ్లీలో చేసిన తీర్మాణాలను శాసన మండలిలో తిరస్కరణకు గురవడాన్ని జీర్ణించుకోలేక , శాసన మండలిని రద్దు చేయాలనే నిర్ణయం జగన్ రాచరిక , నియంత పాలనను గుర్తు చేస్తోందని రాజకీయ ఉద్దండుల వ్యాఖ్యలు చేసేదాకా వెళ్లింది,
ప్రత్యక్ష ఎన్నికలలో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు ఉండగా వాటిని పెంచేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు . అయితే కోర్టు జోక్యం వలన కొంత పెండింగ్ ఉంది. దీని వలన కొన్ని వర్గాలు దూరమైతే కొన్ని వర్గాలు దగ్గరకానున్నాయి. నామినేషన్ పదవులు మంచి పేరును తెచ్చిపెట్టాయి. శాసన మండలి లో బిల్లుల ఆమోదం కోసం జరిగిన రభస - మండలి రద్దు నిర్ణయం రాజకీయపరంగా మెజార్టీ మైనస్ కానుంది.
వైసిపి ఏడాది పాలన లో నూరు శాతం మార్కులు వచ్చాయని అధికారపార్టీ సెల్ప్ వాల్యూషన్ చేసింది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం - చేసింది తక్కువ ఇంకా చేయాల్సింది చాలా ఉందంటున్నారు..
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో చెప్పినవి కొన్ని వివిధ కారణాల రీత్యా జాప్యం అయ్యాయి. కొన్ని ఇంకా శ్రీకారం చుట్టలేదు . చేసిన వాటిలో కొన్ని లోపాలున్నాయని పూర్తిగా పరిష్కారం లభించలేదని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నవి .   రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాల పంపినీ చేయాల్సి ఉంది. 28 లక్షల మందికి స్థలాలు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. నియోజకవర్గానికి బోరింగ్ రిగ్ ద్వారా రైతులకు బోర్లు తవ్వే కార్యక్రమం ఇంకా శ్రీకారం చుట్టలేదు. వివిధ కార్పోరేషన్లకు నిధులు తో పాటు డ్వాక్రా గ్రూపుల రుణమాపీ లాంటివి పెండింగ్ లో ఉన్నాయి.  కరోనా లాక్ డౌన్ లో కరెంటు చార్జీల పెంపు ప్రజలపై పెను భారం మోపింది. ప్రభుత్వం బిల్లులు మాఫీ చేయడమో లేక తగ్గించడమో చేస్తే కాని ప్రజలు శాంతించేలా లేరు. కడివిడి పాలల్లో విషం చుక్క పడ్డట్టు - కరెంటు చార్జీలు....  చేసిన మంచి అంతా మర్చిపోయేలా చేసింది..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2 లక్షల 25 వేల కోట్లయితే - చేసిన కేటాయింపులకు ,చేసిన ఖర్చుకు వ్యత్యాసం ఉంది . ఇచ్చిన హమీల్లో 80 శాతం మేర హమీలు ఏడాదిలో నెరవేర్చామని జగన్ సర్కార్ సర్టిపికెట్ ఇస్తోంది. కానీ , వాస్తవంగా బడ్జెట్ కు చేసిన ఖర్చుకు పొంతన లేదు . కొన్ని పద్దులకు శాఖలకు నిధులు జమ కాలేదు. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉంటే మూడున్నర కోట్ల మందికి ఏదోక ప్రభుత్వ కార్యక్రమం చేరువైంది.
అధికారం లేకుండా పదేళ్లు పనిచేసిన వైసీపీ కార్యకర్తల్లో, నాయకుల్లో అసంతృప్తి నిరాశ నిలువునా కమ్మింది. పదవులు రాలేదని కొందరు.. నాలుగు రాళ్లు సంపాదించుంకుందామంటే అవకాశం దొరకడంలేదని , ఏమీ పని చేయించుకోలేకపోతున్నామని అంతరంగంగా , బహిర్గతంగా వెల్లడిస్తున్నారు. పదేళ్ల కష్టానికి ఫలితం ఉండాలి కదా అంటున్నారు. అధినేత మాత్రం దూర దృష్టి తో ఆలోచిస్తుండగా, పునాదిలాంటి కార్యకర్తలు పార్టీ నాయకులు లేనిదే మనుగడ కష్టం అనేది గుర్తించాలంటున్నారు.
జగన్ ప్రభుత్వం ఏడాదిలో ఎన్నో చేసింది.. ఒక్క ఏడాదిలోనే ఇన్ని చేస్తే ఇంకా నాలుగేళ్ల కాలంలో ఎంతో చేయవచ్చు అంటున్నారు జగన్. ఇప్పటి వరకు సంక్షేమంపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం - పాలనలో ప్రజల సూచనలు తీసుకుని అభివృద్ది వైపు అడుగులు వేయాల్సిఉంది. కొన్ని కార్యక్రమాలు కొందరికి స్వీట్ గా ఉంటే మరికొందరికి కొన్ని చేదు అన్పించాయి. స్థానిక సంస్థల విజయంపై ఏడాది ప్రోగ్రెస్ ప్రభావం చూపే అవకాశం ఉంది. మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారా అంటే , ప్రైమ్9 సర్వేలో అవునన్న వారే ఎక్కువమంది ఉంటే.. కాదు అనే వారు కూడా ఉన్నారు.  మరి , మిగిలిన నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంటుందన్నది కాలమే తేల్చనుంది 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox