ఆంధ్రప్రదేశ్ : సీఎం జగన్ పాలనలో దళితులకి జీవించే హక్కు లేదా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ ప్రశ్నించారు. అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వరప్రసాద్‌కి శిరోముండనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కు పెట్టుకోలేదని కిరణ్‌ని కొట్టి చంపారని లోకేష్ పేర్కొన్నారు.
జగన్ గారి పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా? మాస్కు పెట్టుకోలేదని కిరణ్‌ని కొట్టి చంపారు. అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వరప్రసాద్‌కి శిరోముండనం చేశారు.
ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్‌పై దాడికి దిగారు. శ్రీకాకుళంలో దళిత యువకుడిపై సీఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇళ్ల పట్టా అడిగినందుకు పలాస, టెక్కలిపట్నం గ్రామస్తుడు మర్రి జగన్‌పై వైసీపీ నాయకులు దాడి చేశారు.
న్యాయం చెయ్యాలంటూ పోలీస్ స్టేషన్‌కి వెళితే నడిరోడ్డుపై తల్లి ముందే బూటు కాలితో తన్ని చితకబాదాడు స్థానిక సీఐ. వైసీపీ నాయకుల్లాగే ప్రజలని హింసిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తలు చదవండి.