Breaking News

జగన్ ను కంట్రోల్ చేయడం మోదీకే సాధ్యం:జేసీ దివాకర రెడ్డి

13 th Jun 2020, UTC
జగన్ ను కంట్రోల్ చేయడం మోదీకే సాధ్యం:జేసీ దివాకర రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సీఎం జగన్ కు ఎవరూ ఎదురు చెప్పే పరిస్దితి లేదని, అందువలన ఆయన నియంతలా చెలరేగుతున్నాడని మాజీ ఎంపి  దివాకర్ రెడ్డి   ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అందరూ డమ్మీలు గా మారారాని ఇటువంటి పరిస్దితి ఇంతకు ముందు ఎప్పుడూ ఎదరువలేదని ఆయన అన్నారు.
 
ఏపీ సీఎం జగన్ ఏసు ప్రభు చెప్పినా వినే పరిస్థితిలో లేడని, తనను  కంట్రోల్‌లో పెట్టడం ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమవుతుందని అన్నారు.  తన సోదరుడు జేసీ ప్రభాకర రెడ్డి అరెస్ట్ పై ఆయన మాట్లాడుతూ తమకు కోర్టు తప్ప వేరే మార్గం లేదని ఆయన చెప్పారు. జేసీ అస్మిత్ రెడ్డికి ఈ వ్యవహారానికి సంబంధమే లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందన్నారు. ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు నడుములు విరిగిపోయి వారు ఏమీ చేయలేక పోతున్నారని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన తమ్ముడి అరెస్టుపై తాను ఏమీ మాట్లాడబోనన్నారు. అరెస్టుకు నిరసనగా ఎలాంటి కార్యక్రమ ప్రణాళిక లేదన్నారు.

నేను నిజం చెబుతున్నా నాకు ఎన్ని లారీలు ఉన్నాయో.. ఎన్ని బస్సులు ఉన్నాయో నాకే తెలియదు. మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఈ ప్రభుత్వం దేనికి అయినా తెగిస్తుంది. దీనికి రూల్స్ లేవు, రెగ్యులషన్స్ లేవు. చట్టం లేదు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలు కొదవ అన్నట్లు ఉంది ఈ పరిస్థితి. ఏమీ చేయలేం. కోర్టుకు వెళ్లాల్సిందే.

. చీఫ్ సెక్రటరీ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. జగన్ సర్వశక్తి సంప్పన్నడు. ఆయనే అల్లా, ఆయనే ఏసు, ఆయనే తిరుపతి వెంక్కన. తన మాటకు ఎదురు చెప్పేవాడు, తనకు ప్రతి పక్షంలో ఎవరు లేకుండా చేయడమే తన ధేయం అన్నట్లుగా ఉంది జగన్ పాలన. జగన్ దగ్గర మంచి అధికారులు ఉన్నా వారి మాట చెల్లుబాట అయ్యేటట్లు లేదు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట కూడా వినే పరిస్థితిలో జగన్ లేడు. నన్ను నడిరోడ్డులో బట్టలు లేకుండా నిలబెట్టాడు.. నా ఆర్థిక మూలాలు లేకుండా చేశాడు. నన్ను అరెస్ట్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.’’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox