ఆంధ్ర సర్కార్ పై కళా వెంకట్రావ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. దొంగలు పాలకులు అవుతారని పోతులూరి వీరబ్రహ్మంగారు చెపితే ఎవరో అనుకున్నామని... కానీ, ఆయన చెప్పింది జగన్, వైసీపీ నేతల గురించి అని అర్థమయిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసారు. జనాలకు నవరత్నాలను పంచుతామని చెప్పి... పంచభూతాలను వైసీపీ నేతలు పంచుకుంటున్నారని కళా వెంకట్ రావు విమర్శించారు. ఇసుక, మట్టిని కూడా వదలకుండా అమ్ముకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నపుడు ఇసుకను ఉచితం గా అందించామని..ఇప్పుడు వైసీపీ నేతలకు కమిషన్లు ఇస్తే తప్ప ఇసుక దొరికే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. మరో వైపు.. రీచ్ లో ఎత్తిన ఇసుక ఇంటికి వెళ్లకుండానే మాయమవుతోందని వైసీపీ ఎమ్మెల్యే లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని... అంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చని ఆయన విమర్శలు గుప్పించారు.
టీడీపీ హయాంలో లారీ ఇసుక రూ. 25 నుంచి రూ. 30 వేల వరకు ఉండేదని... ఇప్పుడు రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నారని కళా వెంకట్రావు మండిపడ్డారు. ఇంత రేటు పెట్టి ఇసుక కొనుక్కోలేక....పెదాలు ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆపేసి.. మొండి గోడల్లో తల దాచుకుంటున్నారని అన్నారు. సామాన్యులకు ఇసుక అందుబాటులోకి వచ్చే విధం గా చర్యలు తీసుకోవాలని... లేకపోతె.. ఇసుక తుఫాను లోనే ప్రభుత్వం కొట్టుకుపోతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. దళితులపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనని... ఇలాంటి చర్యలను మానుకోవాలని కళా వెంకట్రావ్ హితవు చెప్పారు.