Breaking News

ఢిల్లీలో జగన్.. కేంద్రమంత్రులతో భేటీ..!

23 rd Sep 2020, UTC
ఢిల్లీలో జగన్.. కేంద్రమంత్రులతో భేటీ..!

న్యూఢిల్లీ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో నిన్న సాయంత్రం సమావేశం అయిన జగన్ వరుసగా రెండో సారీ సమావేశమయ్యారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం‌ కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అమిత్ షాతో సమావేశం ముగిసిన తరువాత ఈరోజు ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కూడా జగన్ సమావేశమయ్యారు.

పోలవరం ప్రాజెక్ట్ తో సహా పలు ప్రాజెక్ట్ లపై సహకారం ఇవ్వాలని కోరారు. దాదాపు 20 నిమిషాల పాటు వీరి చర్చలు జరిగాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు కూడా పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరం అయిన నిధులు అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ ను పర్యటించడానికి రావాల్సిందిగా కేంద్ర జల శక్తీ మంత్రి షెకావత్ ను సీఎం జగన్ కోరారు. త్వరలోనే ఆయన పర్యటన కు వస్తానని హామీ ఇచ్చారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానం విషయమై కూడా వీరు చర్చించారని సమాచారం. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox