ఆంధ్రప్రదేశ్ :విజయవాడలో నిర్మాణం పూర్తి చేసుకున్న దుర్గ గుడి ఫ్లై ఓవర్‌ను విజయవాడ ఎంపీ
కేశినేని నాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లైఓవర్ పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. బెజవాడ వాసుల చిరకాల కోరిక నెరవేరబోతుందన్నారు. కనకదుర్గా ఫ్లైఓవర్ సాధ్యం కాదని అనేక పార్టీలు అన్నాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు.
కేంద్ర మంత్రి గడ్కరీ సహకారంతో ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిందన్నారు. నితిన్ గడ్కరీకి బెజవాడ ప్రజలు రుణ పడి ఉంటారని వెల్లడించారు. అద్భుతమైన నిర్మాణం ఈ ఫ్లైఓవర్ అని, 4వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారన్నారు. ఈ ప్రాంత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని మూడు ముక్కలు చేశారన్నారు. ఫ్లై ఓవర్ ఆయన పరిధి కాదు కాబట్టి దీని జోలికి రాలేదని లేకపోతే ఫ్లైఓవర్‌ని కూడా మూడు ముక్కలు చేసేవారని కేశినేని నాని పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు చదవండి.